ఇంకాఁ బెనఁగ నేల యింత చాలదా
(॥పల్లవి॥)
ఇంకాఁ బెనఁగ నేల యింత చాలదా
వుంకువగా నింతపని కోరిచినదాననా
(॥ఇంకా॥)
వొద్దికి నే రాఁగానె వొక్కరితో మాఁటలాడే
వద్దో నాకు సిగ్గియ్యీ సంపరా నన్ను
పెద్దరికేలకె నేఁ బెనఁగెటిదాన నింతే
సుద్దు లెల్లాఁ గంటి నంత చులుకనిదాననా
(॥ఇంకా॥)
దగ్గరి నే నుండఁగానె తలవంచు కుండితివి
అగ్గల మయ్యీఁ గోప మంపరా నన్ను
సిగ్గుతోడి బతు కొక్క చీమం తయినఁ జాలు
యెగ్గు లెంచ మీద టెత్తు యెరఁగనిదాననా
(॥ఇంకా॥)
కాఁగిలించుకుండఁగానె కన్నులు మూసేవు నీవు
ఆఁగితిఁగా నిన్నిందాఁకా నంపరా నన్ను
చేఁగ దేఁర గూడితివి శ్రీవెంకటేశ నన్ను
రాఁగిన నీపొందు లెల్ల రచ్చ వేసేదానానా
(||pallavi||)
iṁkām̐ bĕnam̐ga nela yiṁta sāladā
vuṁkuvagā niṁtabani korisinadānanā
(||iṁkā||)
vŏddigi ne rām̐gānĕ vŏkkarido mām̐ṭalāḍe
vaddo nāgu siggiyyī saṁparā nannu
pĕddarigelagĕ nem̐ bĕnam̐gĕḍidāna niṁte
suddu lĕllām̐ gaṁṭi naṁta suluganidānanā
(||iṁkā||)
daggari ne nuṁḍam̐gānĕ talavaṁchu kuṁḍidivi
aggala mayyīm̐ goba maṁparā nannu
siggudoḍi badu kŏkka sīmaṁ tayinam̐ jālu
yĕggu lĕṁcha mīda ṭĕttu yĕram̐ganidānanā
(||iṁkā||)
kām̐giliṁchuguṁḍam̐gānĕ kannulu mūsevu nīvu
ām̐gidim̐gā ninniṁdām̐kā naṁparā nannu
sem̐ga dem̐ra gūḍidivi śhrīvĕṁkaḍeśha nannu
rām̐gina nībŏṁdu lĕlla rachcha vesedānānā