Imkaa royadu naagu nemtimanasu

ఇంకా రోయదు నాకు నేఁటిమనసు
Language

(॥పల్లవి॥)
ఇంకా రోయదు నాకు నేఁటిమనసు
కొంకులేని నావంటి కూళలూఁ గలరుగా

(॥ఇంకా॥)
వంతులకు రావంటా వాదులడచి నీతోను
యింత మన నొప్పించేదేఁటిబదుకు
కాంతలు నావంటివారు గలరెందరై నా నీకుఁ
నింత వలచి తిరిగే యెడ్డ లేదు గాని

(॥ఇంకా॥)
అప్పటి వొలిసీనొల్లనట్టివలపు నీమీఁద-
నిప్పుడె కొనవేసేది యేఁటిబదుకు
కప్పిన తమకములు కలపు గంపలకొద్ది
విప్పుచు నవ్వేనావంటి వెఱ్ఱి లేదు గాని

(॥ఇంకా॥)
మందలించి నీ వాడినమాట కల్లలాయనంటా
నిందరితోఁ జెప్పేది నాదేఁటిబదుకు
అందుకె శ్రీవేంకటేశ అంతలో నన్నుఁ గూడితి
పొందులేదా నావంటిభోగి లేదు గాని

(||pallavi||)
iṁkā royadu nāgu nem̐ṭimanasu
kŏṁkuleni nāvaṁṭi kūḽalūm̐ galarugā

(||iṁkā||)
vaṁtulagu rāvaṁṭā vādulaḍasi nīdonu
yiṁta mana nŏppiṁchedem̐ṭibadugu
kāṁtalu nāvaṁṭivāru galarĕṁdarai nā nīgum̐
niṁta valasi tirige yĕḍḍa ledu gāni

(||iṁkā||)
appaḍi vŏlisīnŏllanaṭṭivalabu nīmīm̐da-
nippuḍĕ kŏnavesedi yem̐ṭibadugu
kappina tamagamulu kalabu gaṁpalagŏddi
vippusu navvenāvaṁṭi vĕṭri ledu gāni

(||iṁkā||)
maṁdaliṁchi nī vāḍinamāḍa kallalāyanaṁṭā
niṁdaridom̐ jĕppedi nādem̐ṭibadugu
aṁdugĕ śhrīveṁkaḍeśha aṁtalo nannum̐ gūḍidi
pŏṁduledā nāvaṁṭibhogi ledu gāni