ఇంకా నిట్టే లాలించుమీ యెప్పుడూ మఱవకుమీ
(॥పల్లవి॥)
ఇంకా నిట్టే లాలించుమీ యెప్పుడూ మఱవకుమీ
పొంకముగా చెలి నింత పోదులు సేసితివి
(॥ఇంకా॥)
సేవ చేసి యాపె నీచిత్తము రానడవఁగా
వావిరి నాపెకు నీవు వలచితివి
కైవశమై యేపొద్దుఁ గాచుక వద్ద నుండఁగా
వేవేలు తెఱఁగుల నీవే మన్నించితిని
(॥ఇంకా॥)
పలుమారు నీ పాదాలు పాడి నిన్ను మెప్పించఁగా
చెలఁగి పట్టపుదేవిఁ జేకొంటివి
కలకాలమును నీవె గతి యని మొక్కఁగాను
జలజాక్షి కియ్యరానిచనవు లిచ్చితివి
(॥ఇంకా॥)
కాంతలచే నాటనుండి కానుకలు నీ కంపఁగా
అంతరంగముగ నేలి యలమితివి
యింతిచెలులము గాన యిన్ని విన్నవించితిమి
యింతటా శ్రీవేంకటేశ యీపెవాఁడ వైతివి
(||pallavi||)
iṁkā niṭṭe lāliṁchumī yĕppuḍū maṟavagumī
pŏṁkamugā sĕli niṁta podulu sesidivi
(||iṁkā||)
seva sesi yābĕ nīsittamu rānaḍavam̐gā
vāviri nābĕgu nīvu valasidivi
kaivaśhamai yebŏddum̐ gāsuga vadda nuṁḍam̐gā
vevelu tĕṟam̐gula nīve manniṁchidini
(||iṁkā||)
palumāru nī pādālu pāḍi ninnu mĕppiṁcham̐gā
sĕlam̐gi paṭṭabudevim̐ jegŏṁṭivi
kalagālamunu nīvĕ gadi yani mŏkkam̐gānu
jalajākṣhi kiyyarānisanavu lichchidivi
(||iṁkā||)
kāṁtalase nāḍanuṁḍi kānugalu nī kaṁpam̐gā
aṁtaraṁgamuga neli yalamidivi
yiṁtisĕlulamu gāna yinni vinnaviṁchidimi
yiṁtaḍā śhrīveṁkaḍeśha yībĕvām̐ḍa vaidivi