ఇంకా నేఁటికి జోలి యేల సేసే విటునాతో
(॥పల్లవి॥)
ఇంకా నేఁటికి జోలి యేల సేసే విటునాతో
సుంకుల యెంతటి జాణో చూపరా నాకు
(॥ఇంకా॥)
కొప్పున సంపెంగలు కోరి నీకు ముడిచితి
నప్పటి సేమంతు లున్నవవి యేడవి
యిప్పుడు యెవ్వతో నాపై యీరసాన కింత చేసి
చొప్పు మార్చిన జాణను చూపరా నాకు
(॥ఇంకా॥)
సరిఁబదకము నీకు చక్కఁగా నేఁ బెట్టితి
నరుదై యున్నది కంఠహర మేడది
వరుస నెవ్వతో నా వలపు తడఁబరచి
చొరువకు వచ్చి నాపఁ జూపరానాకు
(॥ఇంకా॥)
చెలఁగి కస్తూరి నీ చెక్కిటఁ బూసితి నింతే
యెలమి నీ తట్టుపుణుఁ గేల వచ్చెను
నెలవై శ్రీవేంకటేశ నిన్నుఁ గూడితి నాచే
సొలయింపించిన జాణఁ జూపరా నాకు
(||pallavi||)
iṁkā nem̐ṭigi joli yela sese viḍunādo
suṁkula yĕṁtaḍi jāṇo sūbarā nāgu
(||iṁkā||)
kŏppuna saṁpĕṁgalu kori nīgu muḍisidi
nappaḍi semaṁtu lunnavavi yeḍavi
yippuḍu yĕvvado nābai yīrasāna kiṁta sesi
sŏppu mārsina jāṇanu sūbarā nāgu
(||iṁkā||)
sarim̐badagamu nīgu sakkam̐gā nem̐ bĕṭṭidi
narudai yunnadi kaṁṭhahara meḍadi
varusa nĕvvado nā valabu taḍam̐barasi
sŏruvagu vachchi nābam̐ jūbarānāgu
(||iṁkā||)
sĕlam̐gi kastūri nī sĕkkiḍam̐ būsidi niṁte
yĕlami nī taṭṭubuṇum̐ gela vachchĕnu
nĕlavai śhrīveṁkaḍeśha ninnum̐ gūḍidi nāse
sŏlayiṁpiṁchina jāṇam̐ jūbarā nāgu