ఇంకా నేఁటి సుద్దులు యెందాఁకాను
(॥పల్లవి॥)
ఇంకా నేఁటి సుద్దులు యెందాఁకాను
పొంకములన్నియును పొదిగున్నవి
(॥ఇంకా॥)
చెలరేఁగి నీవు తొల్లి చెప్పిన బుద్దులెల్లా
తలఁపులో నాతనికిఁ దగిలున్నవి
చలపట్టి సేసినట్టి సరసపుఁ జేతలెల్లా
నిలువునఁ జెక్కులెల్లా నిండి వున్నవి
(॥ఇంకా॥)
నెమ్మది నీవు దొల్లి నేరిపిన నేర్పులెల్లా
సమ్మతిల్ల నాతనికి సతమైనవి
పమ్మి నీవు గరఁగించి పాడిన పాటలెల్లా
కమ్మి యాతని చెవులఁ గాఁపురములున్నవి
(॥ఇంకా॥)
నిరతి నలమేల్మంగ నీవతనిఁ గూడఁగాను
సిరులు శ్రీవేంకటేశుఁ జెంది వున్నవి
సరి నీకాఁగిటిలోని చన్నుల వొత్తులెల్లాను
వురముపై నాతనికి వుంకువైనవి
(||pallavi||)
iṁkā nem̐ṭi suddulu yĕṁdām̐kānu
pŏṁkamulanniyunu pŏdigunnavi
(||iṁkā||)
sĕlarem̐gi nīvu tŏlli sĕppina buddulĕllā
talam̐pulo nādanigim̐ dagilunnavi
salabaṭṭi sesinaṭṭi sarasabum̐ jedalĕllā
niluvunam̐ jĕkkulĕllā niṁḍi vunnavi
(||iṁkā||)
nĕmmadi nīvu dŏlli neribina nerbulĕllā
sammadilla nādanigi sadamainavi
pammi nīvu garam̐giṁchi pāḍina pāḍalĕllā
kammi yādani sĕvulam̐ gām̐puramulunnavi
(||iṁkā||)
niradi nalamelmaṁga nīvadanim̐ gūḍam̐gānu
sirulu śhrīveṁkaḍeśhum̐ jĕṁdi vunnavi
sari nīgām̐giḍiloni sannula vŏttulĕllānu
vuramubai nādanigi vuṁkuvainavi