ఇంకా నెంత నేసునో యీపెకు నీతోడి పొందు
(॥పల్లవి॥)
ఇంకా నెంత నేసునో యీపెకు నీతోడి పొందు
పొంకమైన కొత్తవలపులది యీ మగువ
(॥॥)
చెమటలు మేననిండె సిగ్గులెల్లా ముంచుకొనె
రమణి నీతో సరసములాడఁగా
తమకము లుప్పతిల్లె తగ నిట్టూర్పులు రేఁగె
తిమురుచు సారెకు నీదిక్కు చూడఁగాను
(॥॥)
సెలవుల నవ్వుదేరె సేసకొప్పు వెడజారె
నెలఁత నీకొలువులో నిలుచుండఁగా
పులకలు మేన నిండె పొదిగె నడియాసలు
నెలకొన్న వేడుకతో నీవద్డ నుండఁగాను
(॥॥)
కమ్ముకొనెఁ గోరికలు కళలు మోహమునఁ దేరె
నెమ్మదిఁ జేతులెత్తి నీకు మొక్కఁగా
యిమ్ముల శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
చిమ్మిరేఁగె వలపులు సేవ సేయఁగాను
(||pallavi||)
iṁkā nĕṁta nesuno yībĕgu nīdoḍi pŏṁdu
pŏṁkamaina kŏttavalabuladi yī maguva
(||||)
sĕmaḍalu menaniṁḍĕ siggulĕllā muṁchugŏnĕ
ramaṇi nīdo sarasamulāḍam̐gā
tamagamu luppadillĕ taga niṭṭūrbulu rem̐gĕ
timurusu sārĕgu nīdikku sūḍam̐gānu
(||||)
sĕlavula navvuderĕ sesagŏppu vĕḍajārĕ
nĕlam̐ta nīgŏluvulo nilusuṁḍam̐gā
pulagalu mena niṁḍĕ pŏdigĕ naḍiyāsalu
nĕlagŏnna veḍugado nīvadḍa nuṁḍam̐gānu
(||||)
kammugŏnĕm̐ gorigalu kaḽalu mohamunam̐ derĕ
nĕmmadim̐ jedulĕtti nīgu mŏkkam̐gā
yimmula śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
simmirem̐gĕ valabulu seva seyam̐gānu