Imkaa nemi gadame imtiro neegu

ఇంకా నేమి గడమే ఇంతిరో నీకు
Language

(॥పల్లవి॥)
ఇంకా నేమి గడమే ఇంతిరో నీకు
అంకెలను పతి వురమందు నిలిచితివే

(॥ఇంకా॥)
అతనినీసొమ్ముగాను అన్నిటానునోమితివే
కాతరాన నిందులకే కాచితివౌనే
చేతులెత్తి మొక్కి చేకొంటివే మనసు
యీతల నీవును మా యీడుకు వచ్చితివే

(॥ఇంకా॥)
నిక్కుతానే వలపులు నీసొమ్ము సేసుకొంటివే
దక్కఁగొని మగనితోఁ దతిగొంటివే
వెక్కసాన నిట్టె వెంటవెంటఁ దగిలితివే
నెక్కొని మావలె నన్నీ నేరుచుకొంటివే

(॥ఇంకా॥)
పొంచి శ్రీవేంకటేశుకే పొంతనాలు గూడితివే
కొంచక ఆసలకెల్లా గురియైతివే
యెంచఁగనీతఁడే మమ్ము నేలినవాడుఇంతలోనే
పంచల మాకుఁగా విన్నపములూఁ జేసితివే

(||pallavi||)
iṁkā nemi gaḍame iṁtiro nīgu
aṁkĕlanu padi vuramaṁdu nilisidive

(||iṁkā||)
adaninīsŏmmugānu anniḍānunomidive
kādarāna niṁdulage kāsidivaune
sedulĕtti mŏkki segŏṁṭive manasu
yīdala nīvunu mā yīḍugu vachchidive

(||iṁkā||)
nikkudāne valabulu nīsŏmmu sesugŏṁṭive
dakkam̐gŏni maganidom̐ dadigŏṁṭive
vĕkkasāna niṭṭĕ vĕṁṭavĕṁṭam̐ dagilidive
nĕkkŏni māvalĕ nannī nerusugŏṁṭive

(||iṁkā||)
pŏṁchi śhrīveṁkaḍeśhuge pŏṁtanālu gūḍidive
kŏṁchaga āsalagĕllā guriyaidive
yĕṁcham̐ganīdam̐ḍe mammu nelinavāḍuiṁtalone
paṁchala māgum̐gā vinnabamulūm̐ jesidive