Imkaa nemi gaavalene yinnimtaa samtosimchidi

ఇంకా నేమి గావలెనే యిన్నింటా సంతోసించితి
Language

(॥పల్లవి॥)
ఇంకా నేమి గావలెనే యిన్నింటా సంతోసించితి
వుంకువ లిచ్చి యేరీతి నొడఁబరచీనే

(॥ఇంకా॥)
వింటిఁగదవే తన వేడుకైన సుద్దులెల్లా
కంటిఁగదే తనరూప కనుఁగొనల
అంటిఁగదవే తొల్లె యన్నింటా తా జాణఁడని
వొంటినుండి మరియేల వొడఁబరచీనే

(॥ఇంకా॥)
చొక్కితిఁగదవే తనసురతపు వేడుకల
మొక్కితిఁగదవే తనకు ముందే చేతుల
నిక్కితిఁగదే తాను నేరిపిన చేఁతుల
వొక్కమాఁటే నన్ను నెంత వొడఁబరచీనే

(॥ఇంకా॥)
నమ్మితిఁగదవే యిట్టె నయముల వాసుల
కమ్మితిఁగదవే తను కాఁగిటిలోన
యెమ్మెల శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
వుమ్మడిఁ దా నిప్పుడేల వొడఁబరచీనే

(||pallavi||)
iṁkā nemi gāvalĕne yinniṁṭā saṁtosiṁchidi
vuṁkuva lichchi yerīdi nŏḍam̐barasīne

(||iṁkā||)
viṁṭim̐gadave tana veḍugaina suddulĕllā
kaṁṭim̐gade tanarūba kanum̐gŏnala
aṁṭim̐gadave tŏllĕ yanniṁṭā tā jāṇam̐ḍani
vŏṁṭinuṁḍi mariyela vŏḍam̐barasīne

(||iṁkā||)
sŏkkidim̐gadave tanasuradabu veḍugala
mŏkkidim̐gadave tanagu muṁde sedula
nikkidim̐gade tānu neribina sem̐tula
vŏkkamām̐ṭe nannu nĕṁta vŏḍam̐barasīne

(||iṁkā||)
nammidim̐gadave yiṭṭĕ nayamula vāsula
kammidim̐gadave tanu kām̐giḍilona
yĕmmĕla śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
vummaḍim̐ dā nippuḍela vŏḍam̐barasīne