ఇంకా నెందాఁకా మాట లిటువంటివే కాదా
(॥పల్లవి॥)
ఇంకా నెందాఁకా మాట లిటువంటివే కాదా
తెంకి నీ గుణాలు నేఁడు తేటతెల్లమాయరా
(॥ఇంకా॥)
కొప్పున సంపెంగలు కోరి నీకు ముడిచితి
యిప్పుడే సేవంతు లున్నవి వేడవిరా
నెప్పున విత్తులలోన నిండెమల్లె లన్నట్లా
చెప్పఁ గొత్తలాయ దానిచేఁతలు నా కిదివో
(॥ఇంకా॥)
నిరతిలో పదకము నీ మెడఁ బెట్టితి నింతే
అరిధిఁ గంటమాలున్న దదేడదిరా
ధర విత్తొకటి వెట్టఁ దా జెట్టొక టైనట్టు
యిరవైన నీచేఁత లిందే కంటిమిరా
(॥ఇంకా॥)
చెలరేఁగి కస్తూరి చెక్కిటఁ బూసితి నింతే
యెలమిఁ దట్టుపుణుఁగు యేల వచ్చెరా
కలసి కల్ల నిజము గాడిఁగట్టినట్లాయ
నెలవై శ్రీవేంకటేశ నిను నేఁ గూడితిరా
(||pallavi||)
iṁkā nĕṁdām̐kā māḍa liḍuvaṁṭive kādā
tĕṁki nī guṇālu nem̐ḍu teḍadĕllamāyarā
(||iṁkā||)
kŏppuna saṁpĕṁgalu kori nīgu muḍisidi
yippuḍe sevaṁtu lunnavi veḍavirā
nĕppuna vittulalona niṁḍĕmallĕ lannaṭlā
sĕppam̐ gŏttalāya dānisem̐talu nā kidivo
(||iṁkā||)
niradilo padagamu nī mĕḍam̐ bĕṭṭidi niṁte
aridhim̐ gaṁṭamālunna dadeḍadirā
dhara vittŏgaḍi vĕṭṭam̐ dā jĕṭṭŏga ṭainaṭṭu
yiravaina nīsem̐ta liṁde kaṁṭimirā
(||iṁkā||)
sĕlarem̐gi kastūri sĕkkiḍam̐ būsidi niṁte
yĕlamim̐ daṭṭubuṇum̐gu yela vachchĕrā
kalasi kalla nijamu gāḍim̐gaṭṭinaṭlāya
nĕlavai śhrīveṁkaḍeśha ninu nem̐ gūḍidirā