ఇంకా నేమౌనో ఇంతట నూరకుండవే
(॥పల్లవి॥)
ఇంకా నేమౌనో ఇంతట నూరకుండవే
కొంకఁబోఁగా నా గోరికొన దాఁకెఁగా
(॥ఇంకా॥)
వొడివట్టి నేఁ దియ్యఁగా వోపనంటాఁ బెనఁగఁగా
వెడఁగునీపోఁకముడి వీడెఁగా యిట్టె
తొడికి కాఁగిలించఁగా తోదోపు లాడఁగాను
పడఁతి నీకుచములు బయలాయఁగా
(॥ఇంకా॥)
మోవినే నా కందియ్యఁగా మోరతోపై నీవుండఁగ
భావించ నీమోవి నాపల్లు సోఁకెఁగా
యీవల నేఁ బైకొనఁగా నిట్టునట్టు బొరలఁగా
చేవ దేరే నీ కొప్పు చెంపలకు జారెఁగా
(॥ఇంకా॥)
పచ్చడము నేఁ గప్పఁగా పంతాలు నీ వాడఁగాను
మచ్చికరతుల సదమద మైతిగా
ఇచ్చకాన శ్రీవేంకటేశుఁడ నేఁ గూడఁగాను
వచ్చి వచ్చి నాకు లోనై వసమైతిగా
(||pallavi||)
iṁkā nemauno iṁtaḍa nūraguṁḍave
kŏṁkam̐bom̐gā nā gorigŏna dām̐kĕm̐gā
(||iṁkā||)
vŏḍivaṭṭi nem̐ diyyam̐gā vobanaṁṭām̐ bĕnam̐gam̐gā
vĕḍam̐gunībom̐kamuḍi vīḍĕm̐gā yiṭṭĕ
tŏḍigi kām̐giliṁcham̐gā todobu lāḍam̐gānu
paḍam̐ti nīgusamulu bayalāyam̐gā
(||iṁkā||)
movine nā kaṁdiyyam̐gā moradobai nīvuṁḍam̐ga
bhāviṁcha nīmovi nāballu som̐kĕm̐gā
yīvala nem̐ baigŏnam̐gā niṭṭunaṭṭu bŏralam̐gā
seva dere nī kŏppu sĕṁpalagu jārĕm̐gā
(||iṁkā||)
pachchaḍamu nem̐ gappam̐gā paṁtālu nī vāḍam̐gānu
machchigaradula sadamada maidigā
ichchagāna śhrīveṁkaḍeśhum̐ḍa nem̐ gūḍam̐gānu
vachchi vachchi nāgu lonai vasamaidigā