Imkaa nemanevayyaa yeduda numdaana nenu

ఇంకా నేమనేవయ్యా యెదుట నుందాన నేను
Language

(॥పల్లవి॥)
ఇంకా నేమనేవయ్యా యెదుట నుందాన నేను
కుంకుమ నీకుఁ బూయనా గురుతుగా నేను

(॥॥)
సన్నలు నీవు సేయఁగా సమ్మతించి కాదనక
విన్నపము సేయనా వేడుకతోడ
వెన్నెలబాయిటఁజేయివేయఁగా నప్పటి నీకు
కన్నుల నే మొక్కనా కడుఁదమకమున

(॥॥)
నాయెడకు జెడలేని నవ్వులెల్లా నవ్వఁగాను
ఆయములు సోఁక నిన్ను నాడనా నేను
దాయక పాయకనీవు దండ నిట్టెకూచుండఁగా
సేయనా వూడిగములు చెప్పినట్టెల్లాను

(॥॥)
పంతమున కాఁగిటను బలిమి నీవు గూడఁగా
మంతనాన మెచ్చనా మచ్చికతోడ
చెంతనే మన్నించితివి శ్రీవేంకటేశ నన్ను
సంతోసించనా నీసరసములకును

(||pallavi||)
iṁkā nemanevayyā yĕduḍa nuṁdāna nenu
kuṁkuma nīgum̐ būyanā gurudugā nenu

(||||)
sannalu nīvu seyam̐gā sammadiṁchi kādanaga
vinnabamu seyanā veḍugadoḍa
vĕnnĕlabāyiḍam̐jeyiveyam̐gā nappaḍi nīgu
kannula ne mŏkkanā kaḍum̐damagamuna

(||||)
nāyĕḍagu jĕḍaleni navvulĕllā navvam̐gānu
āyamulu som̐ka ninnu nāḍanā nenu
dāyaga pāyaganīvu daṁḍa niṭṭĕgūsuṁḍam̐gā
seyanā vūḍigamulu sĕppinaṭṭĕllānu

(||||)
paṁtamuna kām̐giḍanu balimi nīvu gūḍam̐gā
maṁtanāna mĕchchanā machchigadoḍa
sĕṁtane manniṁchidivi śhrīveṁkaḍeśha nannu
saṁtosiṁchanā nīsarasamulagunu