Imkaa nela talampimchee nibudu naagu

ఇంకా నేల తలఁపించీ నిపుడు నాకు
Language

(॥పల్లవి॥)
ఇంకా నేల తలఁపించీ నిపుడు నాకు
అంకెకుఁ దెచ్చి తాను అవి యేడ సుద్దులే

(॥ఇంకా॥)
మాటలాడవచ్చుఁగాని మనసు నమ్మించరాదు
యేఁటికి నొడఁబరచీ నీతఁడు నన్ను
గాఁటపుతనచేఁతలు కన్నులారఁ గంటి నేను
యేఁట వెట్టి యాడఁగాక ఇఁక నేడసుద్దులే

(॥ఇంకా॥)
అండకు రావచ్చుఁగాని అలుక మానుపరాదు
బెండ నాతోనేలపెనఁగాడీనే
వుండనుండఁ గానవచ్చె నోజలు తనవి నేఁడు
వండును వలపులు అప్పటి నేడసుద్దులే

(॥ఇంకా॥)
చెనకఁగవచ్చుఁగాని సిగ్గు విడిపించరాదు
వినయాన నన్ను నెంత వేఁడుకొనీనే
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనే నే మెచ్చితి
యినుమండించెను మోహ మిదియేడసుద్దులే

(||pallavi||)
iṁkā nela talam̐piṁchī nibuḍu nāgu
aṁkĕgum̐ dĕchchi tānu avi yeḍa suddule

(||iṁkā||)
māḍalāḍavachchum̐gāni manasu nammiṁcharādu
yem̐ṭigi nŏḍam̐barasī nīdam̐ḍu nannu
gām̐ṭabudanasem̐talu kannulāram̐ gaṁṭi nenu
yem̐ṭa vĕṭṭi yāḍam̐gāga im̐ka neḍasuddule

(||iṁkā||)
aṁḍagu rāvachchum̐gāni aluga mānubarādu
bĕṁḍa nādonelabĕnam̐gāḍīne
vuṁḍanuṁḍam̐ gānavachchĕ nojalu tanavi nem̐ḍu
vaṁḍunu valabulu appaḍi neḍasuddule

(||iṁkā||)
sĕnagam̐gavachchum̐gāni siggu viḍibiṁcharādu
vinayāna nannu nĕṁta vem̐ḍugŏnīne
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone ne mĕchchidi
yinumaṁḍiṁchĕnu moha midiyeḍasuddule