ఇంకా నేల తడవేవు యేరా నీవు
(॥పల్లవి॥)
ఇంకా నేల తడవేవు యేరా నీవు
సంకె దేరె నీకు నీ చలమూఁ జెల్లెనూ
(॥ఇంకా॥)
మాఁట నీతో నాడితిన మనసు దెలిసితిని
యేఁటికి నన్నుఁ బిలిచే వేరా నీవు
యీటుతోఁ బెండ్లాడితిని యిట్టె సేస వెట్టితివి
వాఁట మాయ వలపులు వద్దనే నుందానను
(॥ఇంకా॥)
చేత నీకు మొక్కితిని చేరి నీతో నవ్వితిని
యీతల నన్నొరసేవు యేరా నీవు
నీతగులు చూపితివి నెగు లెల్లాఁ బాపితిని
యేతు నీకు గన మాయ యియ్యకొంటి వందుకూ
(॥ఇంకా॥)
కన్నుల నిన్నుఁ జూచితి కాఁగిటిలో నున్నదాన
యెన్నేసి ప్రియాలు చేప్పే వేరా నీవూ
నన్ను మన్నించితి విట్టె నంటున శ్రీవెంకటేశ
చిన్నిపులకలు నేఁడె సెలవు నా కాయను
(||pallavi||)
iṁkā nela taḍavevu yerā nīvu
saṁkĕ derĕ nīgu nī salamūm̐ jĕllĕnū
(||iṁkā||)
mām̐ṭa nīdo nāḍidina manasu dĕlisidini
yem̐ṭigi nannum̐ bilise verā nīvu
yīḍudom̐ bĕṁḍlāḍidini yiṭṭĕ sesa vĕṭṭidivi
vām̐ṭa māya valabulu vaddane nuṁdānanu
(||iṁkā||)
seda nīgu mŏkkidini seri nīdo navvidini
yīdala nannŏrasevu yerā nīvu
nīdagulu sūbidivi nĕgu lĕllām̐ bābidini
yedu nīgu gana māya yiyyagŏṁṭi vaṁdugū
(||iṁkā||)
kannula ninnum̐ jūsidi kām̐giḍilo nunnadāna
yĕnnesi priyālu seppe verā nīvū
nannu manniṁchidi viṭṭĕ naṁṭuna śhrīvĕṁkaḍeśha
sinnibulagalu nem̐ḍĕ sĕlavu nā kāyanu