(॥పల్లవి॥)
ఇంకా నేల తడవే వేరా నీవు
సంకె దేరె నాకు నీ చలమూఁ జెల్లెనూ
(॥ఇంకా॥)
మాట నీతో నాడితిని మనసూఁ దెలిసితిని
యేఁటికి నన్నుఁ బిలిచే వేరా నీవు
యీటుతోఁ బెండ్లాడితివి యిట్టె సేస వెట్టితివి
వాఁట మాయ వలపులు వద్ద చే నుందానను
(॥ఇంకా॥)
చేత నీకు మొక్కితిని చేరి నీతో నవ్వితిని
యీతల నన్నొరసేవు యేరా నీవు
నీ తగులు చూపితివి నెగు లెల్లా బాపితిని
యేతు నీకు గన మాయ నియ్యకొంటి నందుకు
(॥ఇంకా॥)
కన్నుల నిన్నుఁ జూచితి కాఁగిటిలో నున్నదాన
యేన్నేసి ప్రియాలు చెప్పే వేరా నీవు
నన్ను మన్నింతిని విట్టె నంటున శ్రీవెంకటేశ
చిన్నపులకలు నిండి సెలవు నా కాయనూ
(||pallavi||)
iṁkā nela taḍave verā nīvu
saṁkĕ derĕ nāgu nī salamūm̐ jĕllĕnū
(||iṁkā||)
māḍa nīdo nāḍidini manasūm̐ dĕlisidini
yem̐ṭigi nannum̐ bilise verā nīvu
yīḍudom̐ bĕṁḍlāḍidivi yiṭṭĕ sesa vĕṭṭidivi
vām̐ṭa māya valabulu vadda se nuṁdānanu
(||iṁkā||)
seda nīgu mŏkkidini seri nīdo navvidini
yīdala nannŏrasevu yerā nīvu
nī tagulu sūbidivi nĕgu lĕllā bābidini
yedu nīgu gana māya niyyagŏṁṭi naṁdugu
(||iṁkā||)
kannula ninnum̐ jūsidi kām̐giḍilo nunnadāna
yennesi priyālu sĕppe verā nīvu
nannu manniṁtini viṭṭĕ naṁṭuna śhrīvĕṁkaḍeśha
sinnabulagalu niṁḍi sĕlavu nā kāyanū