Imkaa nela naasedi yedamaadalu

ఇంకా నేల నాచేతి యెడమాటలు
Language

(॥పల్లవి॥)
ఇంకా నేల నాచేతి యెడమాటలు
అంకెకు వచ్చున్నవాఁడు ఆడనె నీ వాడవే

(॥ఇంకా॥)
తుచ్చము లే మాడితవో దూరు లెంత దూరితవో
ముచ్చట దీరఁ బతికి మొక్కవే నీవు
పచ్చిగా నీ మంచముపై పవళించి వున్నవాఁడు
యిచ్చకపుప్రియములు యేకతానఁ జేయవే

(॥ఇంకా॥)
యే మని చెప్పించితివో యెంతేసి పెనఁగితివో
మోము చూచి వొక్కమాటు మొక్కవే నీవు
చే ముట్టక నీవద్దనె సిరసు వంచుకున్నాఁడు
కామించి యాతనిమతి కరఁగించఁగదవే

(॥ఇంకా॥)
నవ్వులేమి నవ్వితినో నాలి యెంత సేవితివో
మువ్వంక నందుకుఁ దగ మెక్కవే నీవు
యివ్వల శ్రీవెంకటేశుఁ డిరవుగ నన్నుఁ గూడె
రవ్వలు సేయక లోలో రతుల మొప్పించవే

(||pallavi||)
iṁkā nela nāsedi yĕḍamāḍalu
aṁkĕgu vachchunnavām̐ḍu āḍanĕ nī vāḍave

(||iṁkā||)
tuchchamu le māḍidavo dūru lĕṁta dūridavo
muchchaḍa dīram̐ badigi mŏkkave nīvu
pachchigā nī maṁchamubai pavaḽiṁchi vunnavām̐ḍu
yichchagabupriyamulu yegadānam̐ jeyave

(||iṁkā||)
ye mani sĕppiṁchidivo yĕṁtesi pĕnam̐gidivo
momu sūsi vŏkkamāḍu mŏkkave nīvu
se muṭṭaga nīvaddanĕ sirasu vaṁchugunnām̐ḍu
kāmiṁchi yādanimadi karam̐giṁcham̐gadave

(||iṁkā||)
navvulemi navvidino nāli yĕṁta sevidivo
muvvaṁka naṁdugum̐ daga mĕkkave nīvu
yivvala śhrīvĕṁkaḍeśhum̐ ḍiravuga nannum̐ gūḍĕ
ravvalu seyaga lolo radula mŏppiṁchave