Imkaa nela mamkumdana mimtidodanu

ఇంకా నేల మంకుఁదన మింతితోడను
Language

(॥పల్లవి॥)
ఇంకా నేల మంకుఁదన మింతితోడను
కంకణాలచేత నీపైఁ గప్పురము చల్లదా

(॥ఇంకా॥)
తలగుచ్చి కాఁగిలించి తమిరేఁచి వేఁడుకోఁగా
చెలి చెప్పినట్టు యింకాఁ జేయవద్దా
తొలుత నిన్నెంతేసి తుటారములాడినాను
బలిమి వెనక నీకుఁ బంతమియ్యదా

(॥ఇంకా॥)
చెక్కునొక్కి బుజ్జగించి శిరసు వంచి మొక్కఁగా
మక్కువతో నియ్యకొని మన్నించవద్దా
యెక్కువతో నిన్నప్పు డెంతచేఁత చేసినాను
వొక్కటై యిప్పుడు ప్రియమొనరించదా

(॥ఇంకా॥)
మోవిచూపి నవ్వించి మునుకొని కూడఁగాను
పూవువలె నిట్లానే భోగించవద్దా
శ్రీవేంకటేశ యెక్కడఁ జెంది నిన్నెలయించినా
వేవేలుగా నిక్కడను వెల్లవిరిసేయదా

(||pallavi||)
iṁkā nela maṁkum̐dana miṁtidoḍanu
kaṁkaṇālaseda nībaim̐ gappuramu salladā

(||iṁkā||)
talaguchchi kām̐giliṁchi tamirem̐si vem̐ḍugom̐gā
sĕli sĕppinaṭṭu yiṁkām̐ jeyavaddā
tŏluda ninnĕṁtesi tuḍāramulāḍinānu
balimi vĕnaga nīgum̐ baṁtamiyyadā

(||iṁkā||)
sĕkkunŏkki bujjagiṁchi śhirasu vaṁchi mŏkkam̐gā
makkuvado niyyagŏni manniṁchavaddā
yĕkkuvado ninnappu ḍĕṁtasem̐ta sesinānu
vŏkkaḍai yippuḍu priyamŏnariṁchadā

(||iṁkā||)
movisūbi navviṁchi munugŏni kūḍam̐gānu
pūvuvalĕ niṭlāne bhogiṁchavaddā
śhrīveṁkaḍeśha yĕkkaḍam̐ jĕṁdi ninnĕlayiṁchinā
vevelugā nikkaḍanu vĕllaviriseyadā