ఇంకా నేల లోఁగేవు యెరిఁగిన పనులకు
(॥పల్లవి॥)
ఇంకా నేల లోఁగేవు యెరిఁగిన పనులకు
సంకెలెల్లాఁ దేరెను చక్కనాయఁ బనులు
(॥ఇంకా॥)
పెదవి తేనెలుగారఁ బ్రియములు చెప్పీ నాపె
అదివో నీ యెదుటనే యప్పటనుండి
కొదదీర నిలుచుండి కొలువుల సేసీ నీకు
పదరక మరి యెంత పనికోకాని
(॥ఇంకా॥)
కమ్మటి నీ రాకలకే కాచుకుండె నిందాఁకా
వుమ్మడి నీ వలపులు వొడిఁబెట్టుక
చిమ్ముచు నవ్వులు నవ్వి చిత్తమెల్లాఁ గరఁగించె
ఇమ్ముల నీ తలపోఁత లెట్టున్నవోకాని
(॥ఇంకా॥)
కలయికలకు లాచి కనుసన్నలెల్లాఁ జేసౌ
చెలరేఁగి చెక్కులెల్లాఁ జెమరించఁగా
అలరి నన్నేలితివి యాకె యలమేలుమంగ
కలిగె శ్రీవేంకటేశ కలిమెంతోకాని
(||pallavi||)
iṁkā nela lom̐gevu yĕrim̐gina panulagu
saṁkĕlĕllām̐ derĕnu sakkanāyam̐ banulu
(||iṁkā||)
pĕdavi tenĕlugāram̐ briyamulu sĕppī nābĕ
adivo nī yĕduḍane yappaḍanuṁḍi
kŏdadīra nilusuṁḍi kŏluvula sesī nīgu
padaraga mari yĕṁta panigogāni
(||iṁkā||)
kammaḍi nī rāgalage kāsuguṁḍĕ niṁdām̐kā
vummaḍi nī valabulu vŏḍim̐bĕṭṭuga
simmusu navvulu navvi sittamĕllām̐ garam̐giṁchĕ
immula nī talabom̐ta lĕṭṭunnavogāni
(||iṁkā||)
kalayigalagu lāsi kanusannalĕllām̐ jesau
sĕlarem̐gi sĕkkulĕllām̐ jĕmariṁcham̐gā
alari nannelidivi yāgĕ yalamelumaṁga
kaligĕ śhrīveṁkaḍeśha kalimĕṁtogāni