ఇంకా నేల దాఁచేవు యీ సుద్దులు
(॥పల్లవి॥)
ఇంకా నేల దాఁచేవు యీ సుద్దులు
కంకణాలు గట్టిన నీ కల్యాణపు సుద్దులు
(॥ఇంకా॥)
ముంగిటికి వచ్చె నివె మోహపు నీ సుద్దులు
అంగడిలోనికి నెక్కె నా సుద్దులు
కొంగుబంగారములాయ కోరికె నీ సుద్దులు
యెంగిలి మోవికి సోఁకె నీ సుద్దులు
(॥ఇంకా॥)
పొంచులకు లోనాయ పొరుగుల నీ సుద్దులు
యెంచితే నెన్న్తెనాఁ గల వీ సుద్దులు
కంచపు పొత్తు గలసె కడలేనినీసుద్దులు
దించరాని మోపులాయ దిన దినసుద్దులు
(॥ఇంకా॥)
ఇసుకపాఁతరలాయ నిదివో నీ సుద్దులు
ముసి ముసి నవ్వులాయ ముందే సుద్దులు
యెసగి శ్రీవేంకటేశ ఇంతలో నన్నేలితివి
కొసరితే నిగిరించీ కూరిమి నీ సుద్దులు
(||pallavi||)
iṁkā nela dām̐sevu yī suddulu
kaṁkaṇālu gaṭṭina nī kalyāṇabu suddulu
(||iṁkā||)
muṁgiḍigi vachchĕ nivĕ mohabu nī suddulu
aṁgaḍilonigi nĕkkĕ nā suddulu
kŏṁgubaṁgāramulāya korigĕ nī suddulu
yĕṁgili movigi som̐kĕ nī suddulu
(||iṁkā||)
pŏṁchulagu lonāya pŏrugula nī suddulu
yĕṁchide nĕnndĕnām̐ gala vī suddulu
kaṁchabu pŏttu galasĕ kaḍaleninīsuddulu
diṁcharāni mobulāya dina dinasuddulu
(||iṁkā||)
isugabām̐taralāya nidivo nī suddulu
musi musi navvulāya muṁde suddulu
yĕsagi śhrīveṁkaḍeśha iṁtalo nannelidivi
kŏsaride nigiriṁchī kūrimi nī suddulu