Imkaa neeyaasa lelayyaa

ఇంకా నీయాస లేలయ్యా
Language

(॥పల్లవి॥)
ఇంకా నీయాస లేలయ్యా
సంకె దీరె నిఁక సట లేలయ్యా

(॥ఇంకా॥)
చెలఁగుచు నీకిదె చేతుల మొక్కే
వలవనిజగడము వద్దయ్యా
పిలిచెను నిన్నాపె పేరు నే వినఁగా
తల తల నన్నింకఁ దడవకువయ్యా

(॥ఇంకా॥)
కడు నీవాకిటఁ గాచుకవుండే
వడిఁబడె వలపులు వద్ద
యెడయక కాచుక యీపె వుండఁగా
నడువక నాతో నవ్వకువయ్యా

(॥ఇంకా॥)
అంకెల నీ కిఁక అడ్డము లాడను
వంక లొత్త నిఁక వద్దయ్యా
కంకిగ శ్రీవేంకటపతి! కూడితి
కొంకు దేరితిని కొరకువయ్యా

(||pallavi||)
iṁkā nīyāsa lelayyā
saṁkĕ dīrĕ nim̐ka saḍa lelayyā

(||iṁkā||)
sĕlam̐gusu nīgidĕ sedula mŏkke
valavanijagaḍamu vaddayyā
pilisĕnu ninnābĕ peru ne vinam̐gā
tala tala nanniṁkam̐ daḍavaguvayyā

(||iṁkā||)
kaḍu nīvāgiḍam̐ gāsugavuṁḍe
vaḍim̐baḍĕ valabulu vadda
yĕḍayaga kāsuga yībĕ vuṁḍam̐gā
naḍuvaga nādo navvaguvayyā

(||iṁkā||)
aṁkĕla nī kim̐ka aḍḍamu lāḍanu
vaṁka lŏtta nim̐ka vaddayyā
kaṁkiga śhrīveṁkaḍabadi! kūḍidi
kŏṁku deridini kŏraguvayyā