Imkaa neesi ttamu kolamdinniyu vinnavimchidi

ఇంకా నీచి త్తము కొలఁదిన్నియు విన్నవించితి
Language

(॥పల్లవి॥)
ఇంకా నీచి త్తము కొలఁదిన్నియు విన్నవించితి
వంకలప్రాయము నీకే వ్రతము వట్టినాఁడే

(॥ఇంకా॥)
తరుణికొప్పువిరులు తనమీఁద రాలుదాఁకా
విరులు ముడువనంటా విభుఁడు నేమముసేసె
సురతగంధము మేన చొడుముట్టినదాఁకా
గరిమఁ బరిమళాలగంధము మైఁ బూయఁడే

(॥ఇంకా॥)
పడఁతి నీవూరుపులు పైఁబారినందాఁకా
విడిచి మేన సురిటి విసరించుకొఁడే
తడిసి నీచెమటలు తనమీఁద చిందుదాఁకా
యెడసి కేళాకూలికి యేఁగఁగ నొల్లఁడే

(॥ఇంకా॥)
పానుపుపై నీవు గూడి పచ్చిమాట లాడుదాఁకా
మోనమున యెవ్వరితో ముచ్చటలు నాడఁడే
ఆని శ్రీవేంకటపతి నట్టె పొందితిగాన
వూనినపరవశాన వొంటి నింకఁ బాయఁడే

(||pallavi||)
iṁkā nīsi ttamu kŏlam̐dinniyu vinnaviṁchidi
vaṁkalaprāyamu nīge vradamu vaṭṭinām̐ḍe

(||iṁkā||)
taruṇigŏppuvirulu tanamīm̐da rāludām̐kā
virulu muḍuvanaṁṭā vibhum̐ḍu nemamusesĕ
suradagaṁdhamu mena sŏḍumuṭṭinadām̐kā
garimam̐ barimaḽālagaṁdhamu maim̐ būyam̐ḍe

(||iṁkā||)
paḍam̐ti nīvūrubulu paim̐bārinaṁdām̐kā
viḍisi mena suriḍi visariṁchugŏm̐ḍe
taḍisi nīsĕmaḍalu tanamīm̐da siṁdudām̐kā
yĕḍasi keḽāgūligi yem̐gam̐ga nŏllam̐ḍe

(||iṁkā||)
pānububai nīvu gūḍi pachchimāḍa lāḍudām̐kā
monamuna yĕvvarido muchchaḍalu nāḍam̐ḍe
āni śhrīveṁkaḍabadi naṭṭĕ pŏṁdidigāna
vūninabaravaśhāna vŏṁṭi niṁkam̐ bāyam̐ḍe