ఇంకా నీమనసెట్టో యెఱఁగఁ జుమ్మీ
(॥పల్లవి॥)
ఇంకా నీమనసెట్టో యెఱఁగఁ జుమ్మీ
కొంకితి నింతే నేఁ గొసరఁ జుమ్మీ
(॥ఇంకా॥)
చుక్కలు గాయఁగా నేఁజూడఁ దలెత్తితి నింతె
ఇక్కడ నేముండుతా నే నెఱఁగఁజుమ్మీ
చిక్కువడ్డముత్యములు చేతులఁ బట్టితి నింతే
అక్కర నివేఁటివని యడుగఁజుమ్మీ
(॥ఇంకా ॥)
తుమ్మిదలు బెదరఁగాఁ దోడ నే నవ్వితి నింతే
తమ్మిమోవి నిన్ను నేమీఁ దడవఁజుమ్మీ
వుమ్మ గాలివిసరఁగా నొంటి నేఁ బండితి నింతే
అమ్మరో నీతో నే నలుగఁజుమ్మీ
(॥ఇంకా॥)
చీకాకురేకులు చూచి చే గోరగీరితి నింతే
చేకొని నీమేను పచ్చిసేయఁజుమ్మీ
యీకడ శ్రీవేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
పైకొని చొక్కితి నింతు పదరఁజుమ్మీ
(||pallavi||)
iṁkā nīmanasĕṭṭo yĕṟam̐gam̐ jummī
kŏṁkidi niṁte nem̐ gŏsaram̐ jummī
(||iṁkā||)
sukkalu gāyam̐gā nem̐jūḍam̐ dalĕttidi niṁtĕ
ikkaḍa nemuṁḍudā ne nĕṟam̐gam̐jummī
sikkuvaḍḍamutyamulu sedulam̐ baṭṭidi niṁte
akkara nivem̐ṭivani yaḍugam̐jummī
(||iṁkā ||)
tummidalu bĕdaram̐gām̐ doḍa ne navvidi niṁte
tammimovi ninnu nemīm̐ daḍavam̐jummī
vumma gālivisaram̐gā nŏṁṭi nem̐ baṁḍidi niṁte
ammaro nīdo ne nalugam̐jummī
(||iṁkā||)
sīgāguregulu sūsi se goragīridi niṁte
segŏni nīmenu pachchiseyam̐jummī
yīgaḍa śhrīveṁkaḍeśha iḍu nannum̐ gūḍidivi
paigŏni sŏkkidi niṁtu padaram̐jummī