Imkaa neegum jelladaa yevvarinemi sesinaa

ఇంకా నీకుఁ జెల్లదా యెవ్వరినేమి సేసినా
Language

(॥పల్లవి॥)
ఇంకా నీకుఁ జెల్లదా యెవ్వరినేమి సేసినా
కొంకనేల యిదివో నాకొంగు నీచే నున్నది

(॥ఇంకా॥)
కోరినట్టె చెల్లెఁగా కొమారికములెల్ల
సారెకు రేపల్లెవాడ సందులలోను
ఆరసి నీవుద్దండాలన్నియును జెల్లెఁగా
కూరిమి సేసిన గోపికలవద్దను

(॥ఇంకా॥)
సేసినట్టె చెల్లెఁగా చేరి రుకుమిణిఁ దెచ్చి
బేసబెల్లి తనపునీ పెండ్లిలోన
యీసు లేక నీవు మాటలేమాడినాఁ జెల్లెఁగా
బాస సేసి నీవు బాలబమ్మచారినన్నవి

(॥ఇంకా॥)
నంటున నీకుఁ జెల్లెఁగా నరకాసురునిఁ దుంచి
వెంటఁ దెచ్చిన పదారువేలవలపు
యింటనె శ్రీవేంకటేశ యిదె నీకుఁ జెల్లెఁగా
జంటల నారతులలో సామ్రాజ్యము

(||pallavi||)
iṁkā nīgum̐ jĕlladā yĕvvarinemi sesinā
kŏṁkanela yidivo nāgŏṁgu nīse nunnadi

(||iṁkā||)
korinaṭṭĕ sĕllĕm̐gā kŏmārigamulĕlla
sārĕgu reballĕvāḍa saṁdulalonu
ārasi nīvuddaṁḍālanniyunu jĕllĕm̐gā
kūrimi sesina gobigalavaddanu

(||iṁkā||)
sesinaṭṭĕ sĕllĕm̐gā seri rugumiṇim̐ dĕchchi
besabĕlli tanabunī pĕṁḍlilona
yīsu lega nīvu māḍalemāḍinām̐ jĕllĕm̐gā
bāsa sesi nīvu bālabammasārinannavi

(||iṁkā||)
naṁṭuna nīgum̐ jĕllĕm̐gā naragāsurunim̐ duṁchi
vĕṁṭam̐ dĕchchina padāruvelavalabu
yiṁṭanĕ śhrīveṁkaḍeśha yidĕ nīgum̐ jĕllĕm̐gā
jaṁṭala nāradulalo sāmrājyamu