Imkaa nee salamemdaamkaanu

ఇంకా నీ చలమెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఇంకా నీ చలమెందాఁకాను
మంకుఁదనములు మానఁగరాదా

(॥ఇంకా॥)
కాటుక కన్నుల గసరీఁ గొసరీ
చాటువ వలపుల జవరాలు
యేఁటికి నీపరాకెందాఁకఁ జేసేవు
కూటపుసరసము గులుకఁగ రాదా

(॥ఇంకా॥)
సురతపుఁగళలటు చూపీ మోపీ
సరికి బేసికి నీపై జవరాలు
పొరలింపుమాటల పొద్దేల జరపేవు
తరుణినింతటనైన దయఁ జూడరాదా

(॥ఇంకా॥)
వెలయనొల నీపై వేసీ మోసీ
చలివాసె యిపుడిట్టే జవరాలు
బలిమి శ్రీవేంకటపతి నీవు గలసితి-
నలివేణి అన్నట్టె అవుననరాదొ

(||pallavi||)
iṁkā nī salamĕṁdām̐kānu
maṁkum̐danamulu mānam̐garādā

(||iṁkā||)
kāḍuga kannula gasarīm̐ gŏsarī
sāḍuva valabula javarālu
yem̐ṭigi nībarāgĕṁdām̐kam̐ jesevu
kūḍabusarasamu gulugam̐ga rādā

(||iṁkā||)
suradabum̐gaḽalaḍu sūbī mobī
sarigi besigi nībai javarālu
pŏraliṁpumāḍala pŏddela jarabevu
taruṇiniṁtaḍanaina dayam̐ jūḍarādā

(||iṁkā||)
vĕlayanŏla nībai vesī mosī
salivāsĕ yibuḍiṭṭe javarālu
balimi śhrīveṁkaḍabadi nīvu galasidi-
naliveṇi annaṭṭĕ avunanarādŏ