Imkaa nee devula suddu lemi yadigevu mammu

ఇంకా నీ దేవుల సుద్దు లేమి యడిగేవు మమ్ము
Language

(॥పల్లవి॥)
ఇంకా నీ దేవుల సుద్దు లేమి యడిగేవు మమ్ము
పొంకముగా నీ గుణాలే పొగడుతా నుండును

(॥ఇంకా॥)
నెలఁతను నీవు మన్నించే మన్ననలెల్లా
చెలులతోఁ జెప్పి జెప్పి చెలరేఁగును
నిలుకడగాఁ దనతో నీవాడిన యేకాంతాలు
తలఁచుక తలఁచుక దైవారును

(॥ఇంకా॥)
సొరిది నీవిచ్చినట్టి సొమ్ములు దనమేనను
సరుగనఁ జూచి చూచి సంతోసించును
అరుదుగఁ దనకడంపిన నీలేకలు
వురముపై నిడుకొని వుప్పొంగును

(॥ఇంకా॥)
చిత్తురు పటాన వ్రాసిన నీరూపమ్ చూచి
హత్తి సరసములాడి యంగవించును
కొత్తగా శ్రీవేంకటేశ కూడితి వింతలోవచ్చి
యిత్తల నిన్ను మఱవ కేకాలము మెచ్చును

(||pallavi||)
iṁkā nī devula suddu lemi yaḍigevu mammu
pŏṁkamugā nī guṇāle pŏgaḍudā nuṁḍunu

(||iṁkā||)
nĕlam̐tanu nīvu manniṁche mannanalĕllā
sĕluladom̐ jĕppi jĕppi sĕlarem̐gunu
nilugaḍagām̐ danado nīvāḍina yegāṁtālu
talam̐suga talam̐suga daivārunu

(||iṁkā||)
sŏridi nīvichchinaṭṭi sŏmmulu danamenanu
saruganam̐ jūsi sūsi saṁtosiṁchunu
arudugam̐ danagaḍaṁpina nīlegalu
vuramubai niḍugŏni vuppŏṁgunu

(||iṁkā||)
sitturu paḍāna vrāsina nīrūbam sūsi
hatti sarasamulāḍi yaṁgaviṁchunu
kŏttagā śhrīveṁkaḍeśha kūḍidi viṁtalovachchi
yittala ninnu maṟava kegālamu mĕchchunu