Imkaa nappadi needo neduraadenaa

ఇంకా నప్పటి నీతో నెదురాడేనా
Language

(॥పల్లవి॥)
ఇంకా నప్పటి నీతో నెదురాడేనా
మంకుదానఁ గాను నిన్నే మరిగితి నేను

(॥ఇంకా॥)
చింతలెల్ల బెడఁ బాసె చెక్కు నీవు నొక్కఁగాను
యింత ప్రియము చెప్ప నే నేమి బాఁతి
యింతులచే మొక్కించి యేల దోసాలు గట్టేవు
చెంతల నేమి చెప్పిన సేసేనయ్య నీకు

(॥ఇంకా॥)
కోపమెల్లాఁ జల్లనాయ కొప్పు నీవు ముడువఁగా
యేపనులు సేసేవు నే నేమి బాఁతి
యీపొద్దు యింటికి వచ్చి యేల రవ్వలు సేసేవు
కోపుల నీమాట లియ్యకొంటినయ్య యిపుడే

(॥ఇంకా॥)
కాయమెల్లాఁ బులకించెఁ గాఁగిట నీవు గూడఁగ-
నీయెడ నిందరిలో నే నేమి బాఁతి
యీయరానిబాస లిచ్చి యేల మోపు గట్టేవు
నాయపు శ్రీవేంకటేశ నమ్మేనయ్య నిన్ను

(||pallavi||)
iṁkā nappaḍi nīdo nĕdurāḍenā
maṁkudānam̐ gānu ninne marigidi nenu

(||iṁkā||)
siṁtalĕlla bĕḍam̐ bāsĕ sĕkku nīvu nŏkkam̐gānu
yiṁta priyamu sĕppa ne nemi bām̐ti
yiṁtulase mŏkkiṁchi yela dosālu gaṭṭevu
sĕṁtala nemi sĕppina sesenayya nīgu

(||iṁkā||)
kobamĕllām̐ jallanāya kŏppu nīvu muḍuvam̐gā
yebanulu sesevu ne nemi bām̐ti
yībŏddu yiṁṭigi vachchi yela ravvalu sesevu
kobula nīmāḍa liyyagŏṁṭinayya yibuḍe

(||iṁkā||)
kāyamĕllām̐ bulagiṁchĕm̐ gām̐giḍa nīvu gūḍam̐ga-
nīyĕḍa niṁdarilo ne nemi bām̐ti
yīyarānibāsa lichchi yela mobu gaṭṭevu
nāyabu śhrīveṁkaḍeśha nammenayya ninnu