ఇంకా నాకే పాటువడే వింత సేసినా నీవు
(॥పల్లవి॥)
ఇంకా నాకే పాటువడే వింత సేసినా నీవు
తెంకినే యీనెఁ(నెం?)జెరివి తీరుట యన్నఁడురా
(॥ఇంకా॥)
వెంగెములే యాడి యాడి వేడుక నీసుద్దులెల్ల
అంగడిఁ బెట్టితి నింత అయ్యో నేను
చంగనిపాపజాతిని సారె నీవు మొక్కఁగాను
వుంగిటిగొనఁ దిట్టితి వూరకే నిన్నును
(॥ఇంకా॥)
చేతులు చాఁచి చాఁచి నీతో వాదడిచి
అతలఁ బంగించితిగా అయ్యో నిన్ను
నీతిలేనిమంకుదాన నీవు చెప్పినపనులు
తోతోయ నీపాదమునఁ దోసితిఁగా నేను
(॥ఇంకా॥)
తేరకొనఁ జూచి చూచి తియ్యని నీమో వెల్ల
అరయఁ బచ్చి సేసితి నయ్యో నేను
కూరిమి శ్రీవేంకటేశ కూడితివి నన్ను నిట్టె
నేరువు చెల్లించుకొంటి నీతోడ నిపుడు
(||pallavi||)
iṁkā nāge pāḍuvaḍe viṁta sesinā nīvu
tĕṁkine yīnĕm̐(nĕṁ?)jĕrivi tīruḍa yannam̐ḍurā
(||iṁkā||)
vĕṁgĕmule yāḍi yāḍi veḍuga nīsuddulĕlla
aṁgaḍim̐ bĕṭṭidi niṁta ayyo nenu
saṁganibābajādini sārĕ nīvu mŏkkam̐gānu
vuṁgiḍigŏnam̐ diṭṭidi vūrage ninnunu
(||iṁkā||)
sedulu sām̐si sām̐si nīdo vādaḍisi
adalam̐ baṁgiṁchidigā ayyo ninnu
nīdilenimaṁkudāna nīvu sĕppinabanulu
todoya nībādamunam̐ dosidim̐gā nenu
(||iṁkā||)
teragŏnam̐ jūsi sūsi tiyyani nīmo vĕlla
arayam̐ bachchi sesidi nayyo nenu
kūrimi śhrīveṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ
neruvu sĕlliṁchugŏṁṭi nīdoḍa nibuḍu