(॥పల్లవి॥)
ఇంకా మరి యాసోద మెంత నీకు
సంకెదీర నన్నిటాను చవులు చూచితివి
(॥ఇంకా॥)
నన్ను నీవు పిలిచేది నవ్వులకో నిజాలకో
కన్నెలు పదారువేలు గలరు నీకు
కన్నుల నీవు చూచేవు కాఁకలకో మేకులకో
మున్నె గొల్లెతలయంగములు చూడవా
(॥ఇంకా॥)
దగ్గరఁ గూచుండేవు తప్పులకో వొప్పులకో
యెగ్గులేని యెనమండ్రు ఇంతులు నీకు
సిగ్గుదీర నవ్వేవు చింతలకో వంతులకో
నిగ్గులగొల్లెతలతో నీవు నాఁడే నవ్వవా
(॥ఇంకా॥)
కలసితి విటు నన్ను ఘాతలకో యేతులకో
యెలమి నిరువంకలా ఇద్దరు నీకు
అలరి శ్రీవేంకటేశ అన్నిటా మన్నించితివి
మెలఁగి లోకమువారి మిక్కిలి మన్నించవా
(||pallavi||)
iṁkā mari yāsoda mĕṁta nīgu
saṁkĕdīra nanniḍānu savulu sūsidivi
(||iṁkā||)
nannu nīvu pilisedi navvulago nijālago
kannĕlu padāruvelu galaru nīgu
kannula nīvu sūsevu kām̐kalago megulago
munnĕ gŏllĕdalayaṁgamulu sūḍavā
(||iṁkā||)
daggaram̐ gūsuṁḍevu tappulago vŏppulago
yĕgguleni yĕnamaṁḍru iṁtulu nīgu
siggudīra navvevu siṁtalago vaṁtulago
niggulagŏllĕdalado nīvu nām̐ḍe navvavā
(||iṁkā||)
kalasidi viḍu nannu ghādalago yedulago
yĕlami niruvaṁkalā iddaru nīgu
alari śhrīveṁkaḍeśha anniḍā manniṁchidivi
mĕlam̐gi logamuvāri mikkili manniṁchavā