ఇంకా మమ్ముఁ జెనకేవు యేరా వోరి
(॥పల్లవి॥)
ఇంకా మమ్ముఁ జెనకేవు యేరా వోరి
కొంకులేక కొసరేవు కొమ్మల నందరిని
(॥॥)
గోవుల మరపినట్టు గొత్లెతల వలపించి
కావరించి తిరిగేవు కానీకానీరా
వేవేలు ఇండ్లు చొచ్చి వెన్నదినేనంటానే
మోవులు చవిగొంటివి ముద్దియల నెల్లను
(॥॥)
పిల్లఁ గోవిరాగాలనె పెక్కుమంత్రాలు మంత్రించి
కల్లరివై తిరిగేవు కానీకానీరా
చల్లదుత్తలంటాను చన్నులపైఁ జేయి చాఁచి
కొల్లగొంటివి మానము కోమలులనెల్లను
(॥॥)
మడుగులఁ జొక్కుచల్లి మచ్చిక నేయించుకొని
గడుసరివై తిరిగేవు కానీకానిరా
నడుమ శ్రీ వేంకటేశ నన్ను నిట్టె యేలితివి
తొడిఁబడఁ గూడితివి తొయ్యలులనెల్లను
(||pallavi||)
iṁkā mammum̐ jĕnagevu yerā vori
kŏṁkulega kŏsarevu kŏmmala naṁdarini
(||||)
govula marabinaṭṭu gŏtlĕdala valabiṁchi
kāvariṁchi tirigevu kānīgānīrā
vevelu iṁḍlu sŏchchi vĕnnadinenaṁṭāne
movulu savigŏṁṭivi muddiyala nĕllanu
(||||)
pillam̐ govirāgālanĕ pĕkkumaṁtrālu maṁtriṁchi
kallarivai tirigevu kānīgānīrā
salladuttalaṁṭānu sannulabaim̐ jeyi sām̐si
kŏllagŏṁṭivi mānamu komalulanĕllanu
(||||)
maḍugulam̐ jŏkkusalli machchiga neyiṁchugŏni
gaḍusarivai tirigevu kānīgānirā
naḍuma śhrī veṁkaḍeśha nannu niṭṭĕ yelidivi
tŏḍim̐baḍam̐ gūḍidivi tŏyyalulanĕllanu