Imkaa maanamdu tanayemme leedanu

ఇంకా మానఁడు తనయెమ్మె లీడను
Language

(॥పల్లవి॥)
ఇంకా మానఁడు తనయెమ్మె లీడను
వుంకువతో నంతయు నే నోరిచితిఁ జాలదా

(॥ఇంకా॥)
ఇచ్చగించి తనమాట లిన్నియు నే నియ్యకొని
వచ్చినదే చాలదా వాకిటికిని
రచ్చల కెక్కిన తనరాతిటిసుద్దులు వింటే
మచ్చర మెవ్వరికైనా మతిలోన రేఁగదా

(॥ఇంకా॥)
మొగము చూచి తనతొ ముచ్చటలు దీరఁగ
నగినదే చాలాదా ననువుగాను
జిగిమీరఁ దనమెనిచిన్న లెల్లాఁ గనుఁగొంటే
యెగసక్కే లెవ్వరికైనానుఁ బుట్టదా

(॥ఇంకా॥)
వాడుదేరి కాఁగిటను వలపులు చల్లి చల్లి
కూడినదే చాదా కొంకుదేరను
యీడనె శ్రీవేంకటేశుఁ డిచ్చినమన్ననలకు
వోగక మావంటివారి కొడఁబాటు గాదా

(||pallavi||)
iṁkā mānam̐ḍu tanayĕmmĕ līḍanu
vuṁkuvado naṁtayu ne norisidim̐ jāladā

(||iṁkā||)
ichchagiṁchi tanamāḍa linniyu ne niyyagŏni
vachchinade sāladā vāgiḍigini
rachchala kĕkkina tanarādiḍisuddulu viṁṭe
machchara mĕvvarigainā madilona rem̐gadā

(||iṁkā||)
mŏgamu sūsi tanadŏ muchchaḍalu dīram̐ga
naginade sālādā nanuvugānu
jigimīram̐ danamĕnisinna lĕllām̐ ganum̐gŏṁṭe
yĕgasakke lĕvvarigainānum̐ buṭṭadā

(||iṁkā||)
vāḍuderi kām̐giḍanu valabulu salli salli
kūḍinade sādā kŏṁkuderanu
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍichchinamannanalagu
vogaga māvaṁṭivāri kŏḍam̐bāḍu gādā