ఇంకా లేదని బొంకే వేలరా నాతో
(॥పల్లవి॥)
ఇంకా లేదని బొంకే వేలరా నాతో
సుంకుల సోరణగండ్లఁ జూడనా నేను
(॥ఇంకా॥)
వొయ్యారి బాగుననుండి వోరగంట నిన్నుఁ జూచి
తొయ్యలి నవ్వు నవ్వె తొలుతే కాదా
పయ్యద ముంజేతఁ జుట్టి పడఁతి పై నొరఁగుక
అయ్యెడ నెందుంటివని అడుగదా నిన్నును
(॥ఇంకా॥)
బంగారు పాములు మెట్టి పాదముపైఁ బాదమూఁది
అంగన నీతో సొలసెనప్పుడే కాదా
ముంగురులు కొనగోళ్ళ ముట్టి ముట్టి చెరుగుతా
వుంగరము నీకిచ్చె నుంకువ గాదా
(॥ఇంకా॥)
వొడివట్టి నిన్నుఁ దీని వుయ్యాల చేరులు వట్టి
పడఁతి నిన్నానవెట్టి పైకొనెఁగాదా
బడినె శ్రీ వేంకటేశ పారితెంచి మాఁడుకూర
తడవి యింత సేసితి దక్కెఁగా నీపనులు
(||pallavi||)
iṁkā ledani bŏṁke velarā nādo
suṁkula soraṇagaṁḍlam̐ jūḍanā nenu
(||iṁkā||)
vŏyyāri bāgunanuṁḍi voragaṁṭa ninnum̐ jūsi
tŏyyali navvu navvĕ tŏlude kādā
payyada muṁjedam̐ juṭṭi paḍam̐ti pai nŏram̐guga
ayyĕḍa nĕṁduṁṭivani aḍugadā ninnunu
(||iṁkā||)
baṁgāru pāmulu mĕṭṭi pādamubaim̐ bādamūm̐di
aṁgana nīdo sŏlasĕnappuḍe kādā
muṁgurulu kŏnagoḽḽa muṭṭi muṭṭi sĕrugudā
vuṁgaramu nīgichchĕ nuṁkuva gādā
(||iṁkā||)
vŏḍivaṭṭi ninnum̐ dīni vuyyāla serulu vaṭṭi
paḍam̐ti ninnānavĕṭṭi paigŏnĕm̐gādā
baḍinĕ śhrī veṁkaḍeśha pāridĕṁchi mām̐ḍugūra
taḍavi yiṁta sesidi dakkĕm̐gā nībanulu