Imka ninnu nemanedi yerimgidi nee gunaalu

ఇంక నిన్ను నేమనేది యెరిఁగితి నీ గుణాలు
Language

(॥పల్లవి॥)
ఇంక నిన్ను నేమనేది యెరిఁగితి నీ గుణాలు
అంకెలనే తమిరేఁచి యెలయఁజేసితివి

(॥ఇంక॥)
నగేవంటా నుంటిఁగాని నాలిసేసె పొద్దువుచ్చి
పగలు సాదించేది భావించనైతి
యెగసక్కేల నేమీనెఱఁగనిఁదాన నన్ను
తెగరానిబాసలిచ్చే తెల్లవారించితివి

(॥ఇంక॥)
మెచ్చేవంటా నుంటిఁగాని మేకులకు మాటలాడి
గచ్చులఁబెట్టేది యెరఁగలేనైతి
బచ్చన సరసముల పయ్యదలో చేయి చాఁచి
తచ్చనమైసోఁకులనే తనివందించితివి

(॥ఇంక॥)
కూడేవంటా నుంటిఁగాక కోక గప్పి నిద్ర వుచ్చి
యీడ గేలిసేసేది యెంచనైతి
తోడనే శ్రీ వేంకటేశ దొరయ నన్నేలితివి
వీడెమిచ్చి యిన్నటాను వెలయఁజూచితివి

(||pallavi||)
iṁka ninnu nemanedi yĕrim̐gidi nī guṇālu
aṁkĕlane tamirem̐si yĕlayam̐jesidivi

(||iṁka||)
nagevaṁṭā nuṁṭim̐gāni nālisesĕ pŏdduvuchchi
pagalu sādiṁchedi bhāviṁchanaidi
yĕgasakkela nemīnĕṟam̐ganim̐dāna nannu
tĕgarānibāsalichche tĕllavāriṁchidivi

(||iṁka||)
mĕchchevaṁṭā nuṁṭim̐gāni megulagu māḍalāḍi
gachchulam̐bĕṭṭedi yĕram̐galenaidi
bachchana sarasamula payyadalo seyi sām̐si
tachchanamaisom̐kulane tanivaṁdiṁchidivi

(||iṁka||)
kūḍevaṁṭā nuṁṭim̐gāga koga gappi nidra vuchchi
yīḍa gelisesedi yĕṁchanaidi
toḍane śhrī veṁkaḍeśha dŏraya nannelidivi
vīḍĕmichchi yinnaḍānu vĕlayam̐jūsidivi