ఇంక నిన్ని యును మేలె యెటువలె నుండినాను
(॥పల్లవి॥)
ఇంక నిన్ని యును మేలె యెటువలె నుండినాను
సుంకుల నా దిక్కు దయఁ జూచితివి నీవు
(॥ఇంక॥)
కన్నులఁ జూచితిఁగా కమ్మటి నీ మోము నేను
యిన్నాళ్లుఁ బాసి వుండినయీసు దీరను
చన్నుల నొత్తితిఁగా సారెకు నీవుర మిట్టె
కన్నులై మీఁదెత్తుకున్న కాఁక దీరను
(॥ఇంక॥)
సంగడిఁ గూచుంటిఁగా జంటై తొల్లిటివలె
కొంగువట్టి నా కోరికె కొనసాగను
అంగము లంటితిఁగా అంకెకు వచ్చినట్టెల్లా
ముంగిటి నావలపులు ముచ్చటెల్లఁ దీరను
(॥నింక॥)
కాఁగిట నించితిగా కమ్మి పానుపున నిన్ను
ఆఁగి రతులఁ జొక్కించి ఆనందానను
వీఁగక నిలిచితిఁగా వేడుకశ్రీ వేంకటేశ
తోఁగి చూచి సురతవు దొమ్ములలో నిపుడు
(||pallavi||)
iṁka ninni yunu melĕ yĕḍuvalĕ nuṁḍinānu
suṁkula nā dikku dayam̐ jūsidivi nīvu
(||iṁka||)
kannulam̐ jūsidim̐gā kammaḍi nī momu nenu
yinnāḽlum̐ bāsi vuṁḍinayīsu dīranu
sannula nŏttidim̐gā sārĕgu nīvura miṭṭĕ
kannulai mīm̐dĕttugunna kām̐ka dīranu
(||iṁka||)
saṁgaḍim̐ gūsuṁṭim̐gā jaṁṭai tŏlliḍivalĕ
kŏṁguvaṭṭi nā korigĕ kŏnasāganu
aṁgamu laṁṭidim̐gā aṁkĕgu vachchinaṭṭĕllā
muṁgiḍi nāvalabulu muchchaḍĕllam̐ dīranu
(||niṁka||)
kām̐giḍa niṁchidigā kammi pānubuna ninnu
ām̐gi radulam̐ jŏkkiṁchi ānaṁdānanu
vīm̐gaga nilisidim̐gā veḍugaśhrī veṁkaḍeśha
tom̐gi sūsi suradavu dŏmmulalo nibuḍu