Imka nennamde nee yemmelu nemdu gaaga

ఇంక నెన్నఁడె నీ యెమ్మెలు నేఁడు గాక
Language

(॥పల్లవి॥)
ఇంక నెన్నఁడె నీ యెమ్మెలు నేఁడు గాక
అంకెల నాతఁడు నీ వాడినట్టె యాడఁగా

(॥ఇంక॥)
చెల్లదా నే కేమి నేఁడు చెలువుని వలపించి
యిల్లు వెళ్లకుండాఁ జేసి యింత సేసితి
పల్లదాన నన్పటిని పంత మాడే వేమి దొడ్డె
కెల్లు రేఁగి ఆతఁడు నీ కింకరుఁ డై యండఁగా

(॥ఇంక॥)
తగదా నీ కే మతనిదండనుండి సవతులఁ
బగలు సాదించ నీవె పనిగొనను
నగ నేలె యాతఁడు నీ నటనకుఁ దగినట్టు
చిగులుతా సారె సారెఁ జెప్పినట్టు సేయఁగా

(॥ఇంక॥)
మేలు గాదా యిందరిలో మించి శ్రీవెంకటేశ్వరు
నాల వై మావంటివారి నాదరించేవు
సోలుచు నీ రాజసాలు చూపేవు నీ కెదు రేది
వేళ గాచి యతఁడు నీ వెంట వెంట రాఁగా

(||pallavi||)
iṁka nĕnnam̐ḍĕ nī yĕmmĕlu nem̐ḍu gāga
aṁkĕla nādam̐ḍu nī vāḍinaṭṭĕ yāḍam̐gā

(||iṁka||)
sĕlladā ne kemi nem̐ḍu sĕluvuni valabiṁchi
yillu vĕḽlaguṁḍām̐ jesi yiṁta sesidi
palladāna nanpaḍini paṁta māḍe vemi dŏḍḍĕ
kĕllu rem̐gi ādam̐ḍu nī kiṁkarum̐ ḍai yaṁḍam̐gā

(||iṁka||)
tagadā nī ke madanidaṁḍanuṁḍi savadulam̐
bagalu sādiṁcha nīvĕ panigŏnanu
naga nelĕ yādam̐ḍu nī naḍanagum̐ daginaṭṭu
siguludā sārĕ sārĕm̐ jĕppinaṭṭu seyam̐gā

(||iṁka||)
melu gādā yiṁdarilo miṁchi śhrīvĕṁkaḍeśhvaru
nāla vai māvaṁṭivāri nādariṁchevu
solusu nī rājasālu sūbevu nī kĕdu redi
veḽa gāsi yadam̐ḍu nī vĕṁṭa vĕṁṭa rām̐gā