ఇంక నెన్నఁ డమ్మ నీ యెన్నిక జాణతనము
(॥పల్లవి॥)
ఇంక నెన్నఁ డమ్మ నీ యెన్నిక జాణతనము
జంకించి మాటాడకున్న సతులఁ గైకొందురా
(॥ఇంక॥)
సూటిగా నిన్నుఁ దప్పక చూచీ నాతఁడు
వాఁటముగఁ దల యెత్తి వంచుకొంటాను
చీటికి మాటికిఁ దానె సెలసి సెలసి నవ్వీ
నాఁటదాన వాతనితో నౌఁ గా దనకుందురా
(॥ఇంక॥)
వేమరుఁ జేయి చాఁచి వేఁడుకొనీ నాతఁడు
సోమరించి దారిమొనాఁ జూపి చూపి
నేమములుఁ బచరించి నెలఁత లంటేఁ జెనకీ
చే ముంచి యాతని నీవు చిమ్మిరేఁచ కుందురా
(॥ఇంక॥)
సిగ్గు విడిచి కూడెను శ్రీవెంకటేశుఁడు
వొగ్గి తల రాయి సేసు కూర కైనాను
నిగ్గుల నలమేల్‌మంగ ని న్నతఁడు గలసెను
వెగ్గళించి నీవలపు వెదచల్ల కుందురా
(||pallavi||)
iṁka nĕnnam̐ ḍamma nī yĕnniga jāṇadanamu
jaṁkiṁchi māḍāḍagunna sadulam̐ gaigŏṁdurā
(||iṁka||)
sūḍigā ninnum̐ dappaga sūsī nādam̐ḍu
vām̐ṭamugam̐ dala yĕtti vaṁchugŏṁṭānu
sīḍigi māḍigim̐ dānĕ sĕlasi sĕlasi navvī
nām̐ṭadāna vādanido naum̐ gā danaguṁdurā
(||iṁka||)
vemarum̐ jeyi sām̐si vem̐ḍugŏnī nādam̐ḍu
somariṁchi dārimŏnām̐ jūbi sūbi
nemamulum̐ basariṁchi nĕlam̐ta laṁṭem̐ jĕnagī
se muṁchi yādani nīvu simmirem̐sa kuṁdurā
(||iṁka||)
siggu viḍisi kūḍĕnu śhrīvĕṁkaḍeśhum̐ḍu
vŏggi tala rāyi sesu kūra kainānu
niggula nalamelmaṁga ni nnadam̐ḍu galasĕnu
vĕggaḽiṁchi nīvalabu vĕdasalla kuṁdurā