ఇంక నేఁటిమాటలు యీడేరెఁ బనులు
(॥పల్లవి॥)
ఇంక నేఁటిమాటలు యీడేరెఁ బనులు
సంకెదేరి యాపెతోనే సరసాలాడేవు
(॥ఇంక॥)
నిన్నుఁ బిలిచితేనొక్క నెలఁతఁ గైదండ వట్టె
వన్నెతోఁ జుట్టమవై వచ్చితివిట్టె
తిన్నఁగా మంచము వేసితే నందుమీఁద నాపెఁ
బెన్నిదిగాఁ గూచుండఁ బెట్టుకొంటివి
(॥ఇంక॥)
చేరి నీకు మొక్కితేను చెలియను సన్నచేసి
ఆరీతి నాపెచేత లెమ్మనిపించేవు
గారబాన నేఁ బువ్వులు గానుక నీకిచ్చితేను
పోరచిగా నాపువ్వులఁ బూజించే వాకెను
(॥ఇంక॥)
శ్రీవేంకటేశ నిన్నుఁ జేరి కాఁగిలించుకొంటే
ఆవేళ నాపెనుఁ గూడ నంటఁబట్టేవు
వేవేగ నీమోవితేనె వేడుకొంటే నీవాపె
తావితేనెలాని యీతల నాకిచ్చేవు
(||pallavi||)
iṁka nem̐ṭimāḍalu yīḍerĕm̐ banulu
saṁkĕderi yābĕdone sarasālāḍevu
(||iṁka||)
ninnum̐ bilisidenŏkka nĕlam̐tam̐ gaidaṁḍa vaṭṭĕ
vannĕdom̐ juṭṭamavai vachchidiviṭṭĕ
tinnam̐gā maṁchamu veside naṁdumīm̐da nābĕm̐
bĕnnidigām̐ gūsuṁḍam̐ bĕṭṭugŏṁṭivi
(||iṁka||)
seri nīgu mŏkkidenu sĕliyanu sannasesi
ārīdi nābĕseda lĕmmanibiṁchevu
gārabāna nem̐ buvvulu gānuga nīgichchidenu
porasigā nābuvvulam̐ būjiṁche vāgĕnu
(||iṁka||)
śhrīveṁkaḍeśha ninnum̐ jeri kām̐giliṁchugŏṁṭe
āveḽa nābĕnum̐ gūḍa naṁṭam̐baṭṭevu
vevega nīmovidenĕ veḍugŏṁṭe nīvābĕ
tāvidenĕlāni yīdala nāgichchevu