ఇంక నేఁటి బిగువు యేల నీకును
(॥పల్లవి॥)
ఇంక నేఁటి బిగువు యేల నీకును
వంక లొత్త నొరగులౌ వాసిమీఁదను
(॥ఇంక॥)
తిలకించి నీచేఁతకు తిట్టు కేల మానును
చలిమి బలిమిఁ గల జవరాలు
అలుగ నీకుఁ దగదు ఆయములు సోఁక నాపె
ఆలమి లోనికి దీసె నందుమీఁదను
(॥ఇంక॥)
చెనకే నీ మాటలకు చేయి చాఁచ కేల మాను
మనసు మర్మము గన్న మదిరాక్షి
పెనఁగ నీకుఁ దగదు ప్రేమములు రేఁగ నాపె
అనువుగగా కళ రేఁచె నందుమీఁదను
(॥ఇంక॥)
కూడిన నీకూటమికి కొన కెక్క కేల మాను
సూడుఁ బాడు నెరింగిన సుదతీమణి
యీడనె శ్రీవెంకటేశ యెనసి నిన్నిదె యాపె
ఆడుకోలు చెల్లించె నందుమీఁదను
(||pallavi||)
iṁka nem̐ṭi biguvu yela nīgunu
vaṁka lŏtta nŏragulau vāsimīm̐danu
(||iṁka||)
tilagiṁchi nīsem̐tagu tiṭṭu kela mānunu
salimi balimim̐ gala javarālu
aluga nīgum̐ dagadu āyamulu som̐ka nābĕ
ālami lonigi dīsĕ naṁdumīm̐danu
(||iṁka||)
sĕnage nī māḍalagu seyi sām̐sa kela mānu
manasu marmamu ganna madirākṣhi
pĕnam̐ga nīgum̐ dagadu premamulu rem̐ga nābĕ
anuvugagā kaḽa rem̐sĕ naṁdumīm̐danu
(||iṁka||)
kūḍina nīgūḍamigi kŏna kĕkka kela mānu
sūḍum̐ bāḍu nĕriṁgina sudadīmaṇi
yīḍanĕ śhrīvĕṁkaḍeśha yĕnasi ninnidĕ yābĕ
āḍugolu sĕlliṁchĕ naṁdumīm̐danu