(॥పల్లవి॥)
ఇంక నెంతగావలె యీ వలపూ
యింకదు చెక్కుచెమట యిదెకాదా వలపు
(॥ఇంక॥)
పెదవిపై వీడెపుఁబిసరు
అదన నిన్నుఁజూచి యసురుసురు
పదరి పయ్యదకొంగుపై విసరు
యెదించీఁ జెలి నీపై నిదెకాదా వలపు
(॥ఇంక॥)
గక్కన మనసులోనికరఁగూ
మొక్కలపుసిగ్గులలో మొరుఁగూ
మిక్కిలి మరుకళల మెరుఁగూ
యిక్కువలు చూపెఁ జెలికిదిగాదా వలపూ
(॥ఇంక॥)
ననుపుతో సెలవుల నగవూ
పెనఁగేటి కాఁగిటి బిగువూ
యెనసెశ్రీవేంకటేశ యింతినిన్నునూ
యినుమడించెఁ దమక మిదిగాదా వలపూ
(||pallavi||)
iṁka nĕṁtagāvalĕ yī valabū
yiṁkadu sĕkkusĕmaḍa yidĕgādā valabu
(||iṁka||)
pĕdavibai vīḍĕbum̐bisaru
adana ninnum̐jūsi yasurusuru
padari payyadagŏṁgubai visaru
yĕdiṁchīm̐ jĕli nībai nidĕgādā valabu
(||iṁka||)
gakkana manasulonigaram̐gū
mŏkkalabusiggulalo mŏrum̐gū
mikkili marugaḽala mĕrum̐gū
yikkuvalu sūbĕm̐ jĕligidigādā valabū
(||iṁka||)
nanubudo sĕlavula nagavū
pĕnam̐geḍi kām̐giḍi biguvū
yĕnasĕśhrīveṁkaḍeśha yiṁtininnunū
yinumaḍiṁchĕm̐ damaga midigādā valabū