ఇంక నెంత గాఁగలదో ఇఁతట నీవు రాకుంటే
(॥పల్లవి॥)
ఇంక నెంత గాఁగలదో ఇఁతట నీవు రాకుంటే
లంకెఁబెట్టె ప్రాణములు లలన నీతోను
(॥॥)
మాటలు నాతో నాడు మనసు నీపై నుండు
చీటికిమాటికి నాతోఁ జెప్పినవే చెప్పును
కాటుకకన్నులు నీరాకకే యెదురుకోనుండు
కోటికిఁ బడగయెత్తెఁ గొమ్మ నీపై మోహము
(॥॥)
వెలఁది నన్నీడ కంపి వెంటనే తానూ వచ్చు
యెలిమిఁ గానుక నీకు నిచ్చినవే ఇచ్చును
సొలసి నీవే నేఁగాజూచి భ్రమసి వెదకు
వలపు వెదలువెట్టీ వాడవాడఁ జెలియ
(॥॥)
సెలవినే నవ్వు నవ్వు శిరసున నీకు మొక్కు
పొలయు నీ ముంగిటనే పొద్దువోకకు
అలరి శ్రీ వేంకటేశ అంగనఁ గూడితి విట్టె
చలిమి బలిమిఁ జూపె జవ్వని నీ యెడను
(||pallavi||)
iṁka nĕṁta gām̐galado im̐taḍa nīvu rāguṁṭe
laṁkĕm̐bĕṭṭĕ prāṇamulu lalana nīdonu
(||||)
māḍalu nādo nāḍu manasu nībai nuṁḍu
sīḍigimāḍigi nādom̐ jĕppinave sĕppunu
kāḍugagannulu nīrāgage yĕdurugonuṁḍu
koḍigim̐ baḍagayĕttĕm̐ gŏmma nībai mohamu
(||||)
vĕlam̐di nannīḍa kaṁpi vĕṁṭane tānū vachchu
yĕlimim̐ gānuga nīgu nichchinave ichchunu
sŏlasi nīve nem̐gājūsi bhramasi vĕdagu
valabu vĕdaluvĕṭṭī vāḍavāḍam̐ jĕliya
(||||)
sĕlavine navvu navvu śhirasuna nīgu mŏkku
pŏlayu nī muṁgiḍane pŏdduvogagu
alari śhrī veṁkaḍeśha aṁganam̐ gūḍidi viṭṭĕ
salimi balimim̐ jūbĕ javvani nī yĕḍanu