ఇంక నేమిచెప్పేము నీ యెమ్మెలు సింగారాలు
(॥పల్లవి॥)
ఇంక నేమిచెప్పేము నీ యెమ్మెలు సింగారాలు
చింకచూపులనుఁ జూచి సిగ్గువిడిపించిరి
(॥ఇంక॥)
ఆవులఁ గాచుచు పరాకైననిన్ను గొల్లెతలు
చేవదేర వలపులు చిమ్మిఁరేచిరి
వోవలఁ బాలెల్లఁ దాగి వుబ్బి మదించీనని
తావిబుజాల గోరికోఁతలు గోసిరి
(॥ఇంక॥)
అంచెలయమునలోన అట్టె యీఁదులాడేనిన్ను
ముంచి మానములు చూపి మోహించిరి
పెంచెవువనాలలోన పిల్లఁగోవిపట్టి నీకు
కంచపుకెమ్మోవు లిచ్చి కళలెల్లా నించిరి
(॥ఇంక॥)
గచ్చకాయలాడే నిన్నుఁ గాఁగిలించుకొని పట్టి
కొచ్చి కొచ్చి చన్నులనే కూరాడిరి
యిచ్చల శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
చెచ్చెర వారెల్ల నీపై సేసవెట్టిరి
(||pallavi||)
iṁka nemisĕppemu nī yĕmmĕlu siṁgārālu
siṁkasūbulanum̐ jūsi sigguviḍibiṁchiri
(||iṁka||)
āvulam̐ gāsusu parāgainaninnu gŏllĕdalu
sevadera valabulu simmim̐resiri
vovalam̐ bālĕllam̐ dāgi vubbi madiṁchīnani
tāvibujāla gorigom̐talu gosiri
(||iṁka||)
aṁchĕlayamunalona aṭṭĕ yīm̐dulāḍeninnu
muṁchi mānamulu sūbi mohiṁchiri
pĕṁchĕvuvanālalona pillam̐govibaṭṭi nīgu
kaṁchabugĕmmovu lichchi kaḽalĕllā niṁchiri
(||iṁka||)
gachchagāyalāḍe ninnum̐ gām̐giliṁchugŏni paṭṭi
kŏchchi kŏchchi sannulane kūrāḍiri
yichchala śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
sĕchchĕra vārĕlla nībai sesavĕṭṭiri