ఇంక నేమి సేయిమనీ నిదేమే తాను
(॥పల్లవి॥)
ఇంక నేమి సేయిమనీ నిదేమే తాను
కంకణము గట్టుకొంటిఁ గరుణించమనవే
(॥ఇంక॥)
నానుపున నవ్వులతో నన్నేలతో వేఁడుకొనీనే
మోనమునఁ దనకు నే మొక్కితిఁగదే
పూనుక చెవిలో తట్టుపునుఁ గేల వూసీనే
కానిమ్మని తనమాఁట గైకొంటిఁగదవే
(॥ఇంక॥)
అగ్గలమై తమ్ముల మిడి యాసలేల పెట్టీనే
సిగ్గునఁ బంతము చెల్లించితిఁగవే
దగ్గరఁ గూచుండి యాల తమకము రేఁచీనే
సగ్గక తనచేఁతకు సమ్మతించిఁగదే
(॥ఇంక॥)
పెదవి తేనియ లాని పిప్పి యాల సేసీనే
వుదుటు గుబ్బులఁ దను నొత్తితిఁ గదే
యిదివో శ్రీ వేంకటేశుఁ డింక నేల కొసరీనే
పొగిడి తనకూటమిఁ బొగడితిఁగదవే
(||pallavi||)
iṁka nemi seyimanī nideme tānu
kaṁkaṇamu gaṭṭugŏṁṭim̐ garuṇiṁchamanave
(||iṁka||)
nānubuna navvulado nannelado vem̐ḍugŏnīne
monamunam̐ danagu ne mŏkkidim̐gade
pūnuga sĕvilo taṭṭubunum̐ gela vūsīne
kānimmani tanamām̐ṭa gaigŏṁṭim̐gadave
(||iṁka||)
aggalamai tammula miḍi yāsalela pĕṭṭīne
siggunam̐ baṁtamu sĕlliṁchidim̐gave
daggaram̐ gūsuṁḍi yāla tamagamu rem̐sīne
saggaga tanasem̐tagu sammadiṁchim̐gade
(||iṁka||)
pĕdavi teniya lāni pippi yāla sesīne
vuduḍu gubbulam̐ danu nŏttidim̐ gade
yidivo śhrī veṁkaḍeśhum̐ ḍiṁka nela kŏsarīne
pŏgiḍi tanagūḍamim̐ bŏgaḍidim̐gadave