ఇంక నేమి సేసునయ్య యింతి నీతోను
(॥పల్లవి॥)
ఇంక నేమి సేసునయ్య యింతి నీతోను
బింకము చూపక నీకుఁ బ్రియములే చెప్పెను
(॥ఇంక॥)
గుట్టుతో నుండెచెలిని గోరఁ జెక్కు నొక్కితేను
తట్టి చేత మూసుకొని తలవంచెను
కిట్టు తొల్లే నవ్వేదాని గిలిగించఁబోతేను
పట్టుకొన్న పయ్యదతోఁ బాదాలకు మొక్కెను
(॥ఇంక॥)
వూడిగము సేసేదాని నొక్కటొక టాడితేను
వేడుకతో నుతియించి వేఁడుకొనెను
వీడె మిచ్చేదాని కొప్పు వెసఁ బట్టి తీసితేను
వోడక నీతమ్ములాన కొగ్గెఁ దనదోసిలి
(॥ఇంక॥)
నీవద్ద నుండినదాని నిండురతిఁ జొక్కించితే
కైవశమై నిన్ను బిగ్గెఁ గాఁగిలించెను
గోవిందరాజవైనకోనేటిశ్రీవేంకటేశ
భావించి నీవు చూచితే పాలిండ్ల నొత్తెను
(||pallavi||)
iṁka nemi sesunayya yiṁti nīdonu
biṁkamu sūbaga nīgum̐ briyamule sĕppĕnu
(||iṁka||)
guṭṭudo nuṁḍĕsĕlini goram̐ jĕkku nŏkkidenu
taṭṭi seda mūsugŏni talavaṁchĕnu
kiṭṭu tŏlle navvedāni giligiṁcham̐bodenu
paṭṭugŏnna payyadadom̐ bādālagu mŏkkĕnu
(||iṁka||)
vūḍigamu sesedāni nŏkkaḍŏga ṭāḍidenu
veḍugado nudiyiṁchi vem̐ḍugŏnĕnu
vīḍĕ michchedāni kŏppu vĕsam̐ baṭṭi tīsidenu
voḍaga nīdammulāna kŏggĕm̐ danadosili
(||iṁka||)
nīvadda nuṁḍinadāni niṁḍuradim̐ jŏkkiṁchide
kaivaśhamai ninnu biggĕm̐ gām̐giliṁchĕnu
goviṁdarājavainagoneḍiśhrīveṁkaḍeśha
bhāviṁchi nīvu sūside pāliṁḍla nŏttĕnu