ఇంక నేమి సేసేవయ్య యింతే శాయను
(॥పల్లవి॥)
ఇంక నేమి సేసేవయ్య యింతే శాయను
సంకెలేని వలపులు జాజరాయను
(॥ఇంక॥)
మగువ నీతో నేఁడు మాటలాడిన ఫలము
చిగురువంటిమోవి చిల్లులాయను
తగిలి యిందాఁకా నీదండ నుండిన ఫలము
వొగరుఁజేఁతల నసురుసురాయను
(॥ఇంక॥)
నలినాక్షి నీతోను నవ్వు నవ్విన ఫలము
చెలఁగి కొప్పెల్ల విడి చిక్కులాయను
యెలమి నీకుఁ జేతులెత్తి మొక్కిన ఫలము
నిలువుకు నిలువే నివ్వెరగులాయను
(॥ఇంక॥)
సుదతి నిన్నుఁ దప్పక చూచినయట్టి ఫలము
కొదలేని రతులకు గురి యాయను
పొదలి శ్రీవేంకటేశ పొందుచేసిన ఫలము
చదురుఁదనాలు నేర్చి జాణాయను
(||pallavi||)
iṁka nemi sesevayya yiṁte śhāyanu
saṁkĕleni valabulu jājarāyanu
(||iṁka||)
maguva nīdo nem̐ḍu māḍalāḍina phalamu
siguruvaṁṭimovi sillulāyanu
tagili yiṁdām̐kā nīdaṁḍa nuṁḍina phalamu
vŏgarum̐jem̐tala nasurusurāyanu
(||iṁka||)
nalinākṣhi nīdonu navvu navvina phalamu
sĕlam̐gi kŏppĕlla viḍi sikkulāyanu
yĕlami nīgum̐ jedulĕtti mŏkkina phalamu
niluvugu niluve nivvĕragulāyanu
(||iṁka||)
sudadi ninnum̐ dappaga sūsinayaṭṭi phalamu
kŏdaleni radulagu guri yāyanu
pŏdali śhrīveṁkaḍeśha pŏṁdusesina phalamu
sadurum̐danālu nersi jāṇāyanu