ఇంక నేమి గావలె నింతకంటె నేమి సేసు
(॥పల్లవి॥)
ఇంక నేమి గావలె నింతకంటె నేమి సేసు
కొంకక మతిఁ దలఁచుకొనరాదా పొందులు
(॥ఇంక॥)
యెట్టనెదుటనే వుండి యెఱుకలు సేసి నీకు
చుట్టరికములు చెప్పీ సుదతి
మట్టుమీరి యప్పటి నీమర్మములు సోఁకఁగాను
గుట్టుతోడ నీవిచ్చినగుఱుతులు చూపీని
(॥ఇంక॥)
యేరుపరచి నీవావి యిరుగుపొరుగువారిఁ
దారుకాణ సేసీని తరుణి
కూరిమితో తాఁ దొల్లి గోరగీరితినని
ఆరితేరి నీమేన నానవాలు చూపీని
(॥ఇంక॥)
కలసినరతివేళ కాఁగిటిలో నీలెక్కలు
చిలుకచే నాడించీఁ జెలియ
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
అలరి నన్నేలితివి యాపె నాలననీని
(||pallavi||)
iṁka nemi gāvalĕ niṁtagaṁṭĕ nemi sesu
kŏṁkaga madim̐ dalam̐sugŏnarādā pŏṁdulu
(||iṁka||)
yĕṭṭanĕduḍane vuṁḍi yĕṟugalu sesi nīgu
suṭṭarigamulu sĕppī sudadi
maṭṭumīri yappaḍi nīmarmamulu som̐kam̐gānu
guṭṭudoḍa nīvichchinaguṟudulu sūbīni
(||iṁka||)
yerubarasi nīvāvi yirugubŏruguvārim̐
dārugāṇa sesīni taruṇi
kūrimido tām̐ dŏlli goragīridinani
ārideri nīmena nānavālu sūbīni
(||iṁka||)
kalasinaradiveḽa kām̐giḍilo nīlĕkkalu
silugase nāḍiṁchīm̐ jĕliya
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
alari nannelidivi yābĕ nālananīni