Imka nemanemu ninnu ichchagamaademugaaga

ఇంక నేమనేము నిన్ను ఇచ్చకమాడేముగాక
Language

(॥పల్లవి॥)
ఇంక నేమనేము నిన్ను ఇచ్చకమాడేముగాక
అంకె వచ్చెఁ బనులెల్లా అవునయ్యా

(॥ఇంక॥)
సేయరానిసేఁతలెల్లాఁ జేసివచ్చి మాతోను
చాయలకు మొరఁగేవు చతురుఁడవు
పాయపువాఁడవు తొల్లె బలుదొర వందుమీఁద
చేయి మీఁదాయ నీకుఁ జెల్లునయ్యా

(॥ఇంక॥)
నగరానినవ్వు లాడ నగి వచ్చి మావొద్ద
సగము పంచి పెట్టేవు చతురుఁడవు
మొగమోడుదువు తొల్లె మోహ మెక్కు డందుమీఁద
చిగిరించెఁదమకము చెల్లునయ్య

(॥ఇంక॥)
మొక్కరానిమొక్కు లాడ మొక్కి శ్రీవేంకటేశుఁడ
చక్కట్లు చెప్పేవు చతురుఁడవు
చిక్కితివి నాకుఁ దొల్లె శ్రీపతి వందుమీఁదట
చెక్కులెల్లాఁ జెమరించెఁ జెల్లునయ్యా

(||pallavi||)
iṁka nemanemu ninnu ichchagamāḍemugāga
aṁkĕ vachchĕm̐ banulĕllā avunayyā

(||iṁka||)
seyarānisem̐talĕllām̐ jesivachchi mādonu
sāyalagu mŏram̐gevu sadurum̐ḍavu
pāyabuvām̐ḍavu tŏllĕ baludŏra vaṁdumīm̐da
seyi mīm̐dāya nīgum̐ jĕllunayyā

(||iṁka||)
nagarāninavvu lāḍa nagi vachchi māvŏdda
sagamu paṁchi pĕṭṭevu sadurum̐ḍavu
mŏgamoḍuduvu tŏllĕ moha mĕkku ḍaṁdumīm̐da
sigiriṁchĕm̐damagamu sĕllunayya

(||iṁka||)
mŏkkarānimŏkku lāḍa mŏkki śhrīveṁkaḍeśhum̐ḍa
sakkaṭlu sĕppevu sadurum̐ḍavu
sikkidivi nāgum̐ dŏllĕ śhrībadi vaṁdumīm̐daḍa
sĕkkulĕllām̐ jĕmariṁchĕm̐ jĕllunayyā