Imka nele yanumaana mennigalu tuda kekke

ఇంక నేలే యనుమాన మెన్నికలు తుద కెక్కె
Language

(॥పల్లవి॥)
ఇంక నేలే యనుమాన మెన్నికలు తుద కెక్కె
సంకె దేరె నిదె మాకు చలివాసె మీకును

(॥ఇంక॥)
సంగడి మీ రిద్దరును సరుసనే కూచుండి
కంగులేక బదుకరే కలకాలము
వుంగిటి నేనూ నుండే నొక్కమనసున నిఁక
వెంగె మాడితి నిన్నాళ్లు వెఱ్ఱిదానవై

(॥ఇంక॥)
రాకాఁబోకాఁ గూడికూడి రాతిరీఁ బగల నిందే
యేకరాజ్య మేలరే యిద్దరూ మీరు
సాకిరిదొరనై వుండే సమ్మతించితిని నేను
కాకు సేసితి నిందాఁకాఁ గట్టిపఁడనై మిమ్మును

(॥ఇంక॥)
ముంచినవేడుకతోడ మోహపురతిఁ గలసి
మంచముపై నుండరే నెమ్మది నంటాను
అంచల శ్రీవేంకటేశుఁ డప్పటి నన్నుఁ గలసె
పొంచి నేరాలు వట్టితిఁ బొద్దువోక నిన్నును

(||pallavi||)
iṁka nele yanumāna mĕnnigalu tuda kĕkkĕ
saṁkĕ derĕ nidĕ māgu salivāsĕ mīgunu

(||iṁka||)
saṁgaḍi mī riddarunu sarusane kūsuṁḍi
kaṁgulega badugare kalagālamu
vuṁgiḍi nenū nuṁḍe nŏkkamanasuna nim̐ka
vĕṁgĕ māḍidi ninnāḽlu vĕṭridānavai

(||iṁka||)
rāgām̐bogām̐ gūḍigūḍi rādirīm̐ bagala niṁde
yegarājya melare yiddarū mīru
sāgiridŏranai vuṁḍe sammadiṁchidini nenu
kāgu sesidi niṁdām̐kām̐ gaṭṭibam̐ḍanai mimmunu

(||iṁka||)
muṁchinaveḍugadoḍa mohaburadim̐ galasi
maṁchamubai nuṁḍare nĕmmadi naṁṭānu
aṁchala śhrīveṁkaḍeśhum̐ ḍappaḍi nannum̐ galasĕ
pŏṁchi nerālu vaṭṭidim̐ bŏdduvoga ninnunu