ఇంక నేలే నిష్టూ రాలు యింటికి వచ్చె నాతఁడు
(॥పల్లవి॥)
ఇంక నేలే నిష్టూ రాలు యింటికి వచ్చె నాతఁడు
కంకణము గట్టుకొని కలయుట గాకా
(॥॥)
పువ్వుల వేసినవారిఁ బూచికాయల వేతురా
నివ్వటిల్లఁ గప్రమైనా నించుట గాక
నవ్విన విభుని నీవు నాఁటఁ జూచి జంకింతురా
చివ్వనఁ బై వలపులు చిలుకుట గాక
(॥॥)
కిన్నెర మీఁటఁగాను గిడిబిళ్ళు వాయింతురా
పన్ని నీవు సుతి గూడి పాడుటగాక
చన్ను లాతఁ డంటఁగాను సణఁగులు రాలుతురా
సన్నలనే సరసాలు చల్లుట గాకా
(॥॥)
తీపులు పైఁజల్లఁ గాను వేఁప చేఁదు వోదురా
యేపునఁ బంచదారైనా నిచ్చుట గాక
పై పై గూడే శ్రీ వేంకటపతి నలయింతురా
చూపట్టు రతుల నిట్టే చొక్కింతురు గాకా
(||pallavi||)
iṁka nele niṣhṭū rālu yiṁṭigi vachchĕ nādam̐ḍu
kaṁkaṇamu gaṭṭugŏni kalayuḍa gāgā
(||||)
puvvula vesinavārim̐ būsigāyala vedurā
nivvaḍillam̐ gapramainā niṁchuḍa gāga
navvina vibhuni nīvu nām̐ṭam̐ jūsi jaṁkiṁturā
sivvanam̐ bai valabulu siluguḍa gāga
(||||)
kinnĕra mīm̐ṭam̐gānu giḍibiḽḽu vāyiṁturā
panni nīvu sudi gūḍi pāḍuḍagāga
sannu lādam̐ ḍaṁṭam̐gānu saṇam̐gulu rāludurā
sannalane sarasālu salluḍa gāgā
(||||)
tībulu paim̐jallam̐ gānu vem̐pa sem̐du vodurā
yebunam̐ baṁchadārainā nichchuḍa gāga
pai pai gūḍe śhrī veṁkaḍabadi nalayiṁturā
sūbaṭṭu radula niṭṭe sŏkkiṁturu gāgā