Imka nele kosaru ide asurusuru

ఇంక నేలే కొసరు ఇదె అసురుసురు
Language

(॥పల్లవి॥)
ఇంక నేలే కొసరు ఇదె అసురుసురు
సంకెదేరె తనకిన్నీ సరివచ్చె ననవే

(॥ఇంక॥)
పనిలేనిపిలుపు బయలీఁతవలపు
వొనర నెంతసేసినా వొల్లనొల్లనే
మనసుముట్టనిమాఁట మాయామృగము వేఁట
తనకె ఇన్నియుఁ జెల్లు తతి వచ్చె ననవే

(॥ఇంక॥)
వచ్చి వెచ్చి నవ్వులు పసలేని రవ్వలు
తచ్చి వేసి నా మీఁద దనిసితినే
నిచ్చ నిచ్చ అసలు నెరులపై సేసలు
అచ్చుపడెఁ దన కిన్నీ వద్దము లేదనవే

(॥ఇంక॥)
చెల్లుబడియానలు చెమటలసోనలు
కల్లగారు యిందుకు నేఁ గరఁగితినే
యిల్లిదె శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁగూడె
మొల్లమాయ రతులివి మొక్కితి నే ననవే

(||pallavi||)
iṁka nele kŏsaru idĕ asurusuru
saṁkĕderĕ tanaginnī sarivachchĕ nanave

(||iṁka||)
panilenibilubu bayalīm̐tavalabu
vŏnara nĕṁtasesinā vŏllanŏllane
manasumuṭṭanimām̐ṭa māyāmṛgamu vem̐ṭa
tanagĕ inniyum̐ jĕllu tadi vachchĕ nanave

(||iṁka||)
vachchi vĕchchi navvulu pasaleni ravvalu
tachchi vesi nā mīm̐da danisidine
nichcha nichcha asalu nĕrulabai sesalu
achchubaḍĕm̐ dana kinnī vaddamu ledanave

(||iṁka||)
sĕllubaḍiyānalu sĕmaḍalasonalu
kallagāru yiṁdugu nem̐ garam̐gidine
yillidĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐gūḍĕ
mŏllamāya radulivi mŏkkidi ne nanave