ఇంక నేలే కొంకను యిద్దరము నున్నారము
(॥పల్లవి॥)
ఇంక నేలే కొంకను యిద్దరము నున్నారము
సంకెలెల్ల దేరె నాకు చనవిచ్చుఁగాక
(॥ఇంక॥)
మచ్చిక సేసినవాఁడు మనసేమి చూచీనే
చెచ్చెర నా చెప్పినట్టు సేసుఁగాక
విచ్చన విడైనవాఁడు వెనకముం దేలెచ్చీనే
కుచ్చి కుచ్చి నామేలే కొసరు గాక
(॥ఇంక॥)
గక్కన నవ్వినవాఁడు కడమలేల పెట్టీనే
వెక్కసపుఁ జన్నులపై వెలయుగాక
వొక్కటైనవాఁడు నాతో నూరకే సిగ్గులేలే
నిక్కి నిక్కి రతినేర్పు నెరపుఁగాక
(॥ఇంక॥)
మంచముపై నున్నవాఁడు మఱఁగులేల పెట్టీనే
కంచపు మోవి యొసఁగి కైకొనుఁగాక
యెంచక శ్రీ వేంకటేశుఁడీడ నిట్టె నన్నుఁ గూడె
మించి మించి నాపొందులే మెరయుఁగాక
(||pallavi||)
iṁka nele kŏṁkanu yiddaramu nunnāramu
saṁkĕlĕlla derĕ nāgu sanavichchum̐gāga
(||iṁka||)
machchiga sesinavām̐ḍu manasemi sūsīne
sĕchchĕra nā sĕppinaṭṭu sesum̐gāga
vichchana viḍainavām̐ḍu vĕnagamuṁ delĕchchīne
kuchchi kuchchi nāmele kŏsaru gāga
(||iṁka||)
gakkana navvinavām̐ḍu kaḍamalela pĕṭṭīne
vĕkkasabum̐ jannulabai vĕlayugāga
vŏkkaḍainavām̐ḍu nādo nūrage siggulele
nikki nikki radinerbu nĕrabum̐gāga
(||iṁka||)
maṁchamubai nunnavām̐ḍu maṟam̐gulela pĕṭṭīne
kaṁchabu movi yŏsam̐gi kaigŏnum̐gāga
yĕṁchaga śhrī veṁkaḍeśhum̐ḍīḍa niṭṭĕ nannum̐ gūḍĕ
miṁchi miṁchi nābŏṁdule mĕrayum̐gāga