Imka nele anumaana mimtadaam deguve kaaga

ఇంక నేలే అనుమాన మింతటాఁ దెగువే కాక
Language

(॥పల్లవి॥)
ఇంక నేలే అనుమాన మింతటాఁ దెగువే కాక
కొంకువాపితే వలపు కొనకెక్కవలెను

(॥ఇంక॥)
మది నింత విచారించ మంచము కిందే నుయ్యి
కదిసినంతటి మీఁదఁగా పనులు
కొదలేక కొన గోరఁ గుమ్మిననాఁచేతలెల్ల
చెదరక ఆకె చూచి సిగ్గు పడవలెను

(॥ఇంక॥)
యెంత లేదు పదవే వేయింటిపై జవ్వాది కొమ్ము
అంతక వచ్చితేఁగా ఆ పనులు
కంతలుగా తన మోవి గంటివడఁజేసితేను
చింత తోడ నాకె చూచి చిన్నఁబోవవలెను

(॥ఇంక॥)
కానీ లేవే ముంజేతి కంకణమున కద్దమా
ఆనినరతుల వేళఁగా పనులు
పూని శ్రీవేంకటపతిఁ బొంది వలపించితిని
పానిపట్టి యాకె చూచి భ్రమయఁగవలెను

(||pallavi||)
iṁka nele anumāna miṁtaḍām̐ dĕguve kāga
kŏṁkuvābide valabu kŏnagĕkkavalĕnu

(||iṁka||)
madi niṁta visāriṁcha maṁchamu kiṁde nuyyi
kadisinaṁtaḍi mīm̐dam̐gā panulu
kŏdalega kŏna goram̐ gumminanām̐sedalĕlla
sĕdaraga āgĕ sūsi siggu paḍavalĕnu

(||iṁka||)
yĕṁta ledu padave veyiṁṭibai javvādi kŏmmu
aṁtaga vachchidem̐gā ā panulu
kaṁtalugā tana movi gaṁṭivaḍam̐jesidenu
siṁta toḍa nāgĕ sūsi sinnam̐bovavalĕnu

(||iṁka||)
kānī leve muṁjedi kaṁkaṇamuna kaddamā
āninaradula veḽam̐gā panulu
pūni śhrīveṁkaḍabadim̐ bŏṁdi valabiṁchidini
pānibaṭṭi yāgĕ sūsi bhramayam̐gavalĕnu