Imka nela tomtisuddu limdaamkaa nimtegaaga

ఇంక నేల తొంటిసుద్దు లిందాఁకా నింతెకాక
Language

(॥పల్లవి॥)
ఇంక నేల తొంటిసుద్దు లిందాఁకా నింతెకాక
వుంకువైన నీ గుణాలె వొక్కటిగాఁ జేసెను

(॥ఇంక॥)
చిగురునవ్వుల నీ చిరుతమోవిగా
అగడైననాకోప మారఁజేసెను
పగటున నీవు సేసే పలువినయాలుగా
తగులుగా నీవున్నదండకు రప్పించెను

(॥ఇంక॥)
కడకన్నుల నీకందువచూపులేకా యీ-
యెడనే వంచిన తల యెత్తించెను
బడి బడి నీవు వచ్చేపాయని మోహమే కా
అడఁగిననామతిలో ఆసలెల్లా రేఁచెను

(॥ఇంక॥)
కమలపు నీచేతుల కాఁగిలి యిప్పుడేకా
సమరతి నాకాఁకలు చల్లఁజేసెను
తమితో శ్రీవేంకటేశ దయ నీవుసేయఁగాఁ గా
ప్రమదపునాకూటమి పరిణామ మాయను

(||pallavi||)
iṁka nela tŏṁṭisuddu liṁdām̐kā niṁtĕgāga
vuṁkuvaina nī guṇālĕ vŏkkaḍigām̐ jesĕnu

(||iṁka||)
sigurunavvula nī sirudamovigā
agaḍainanāgoba māram̐jesĕnu
pagaḍuna nīvu sese paluvinayālugā
tagulugā nīvunnadaṁḍagu rappiṁchĕnu

(||iṁka||)
kaḍagannula nīgaṁduvasūbulegā yī-
yĕḍane vaṁchina tala yĕttiṁchĕnu
baḍi baḍi nīvu vachchebāyani mohame kā
aḍam̐ginanāmadilo āsalĕllā rem̐sĕnu

(||iṁka||)
kamalabu nīsedula kām̐gili yippuḍegā
samaradi nāgām̐kalu sallam̐jesĕnu
tamido śhrīveṁkaḍeśha daya nīvuseyam̐gām̐ gā
pramadabunāgūḍami pariṇāma māyanu